జైశ్రీరామ్.
శ్లో. అర్థానా మార్జనే దుఖం, ఆర్జితానాం
చ రక్షణే
ఆయే దుఃఖం , వ్యయే దుఖం ధిర్థాః కష్టసంశ్రయాః.
ఆయే దుఃఖం , వ్యయే దుఖం ధిర్థాః కష్టసంశ్రయాః.
క. ధన సంపాదన దుఃఖము.
ధన రక్షణ దుఃఖమయము ధన
మొచ్చు నెడన్,
ధనమది ఖర్చగు వేళను
మనకౌనది దుఃఖ ప్రదము.
మది గనుడయ్యా.
భావము. ధనాన్ని
సంపాదించటంలో దుఃఖం , సంపాదించిన
దానిని రక్షించటంలో దుఃఖం .ఆదాయంలో దుఃఖం , వ్యయంలో
దుఖం. అయ్యో సంపదలు ఎన్నో
కష్టాలను ఆశ్రయించుకొని ఉంటాయి కదా!
జైహింద్
1 comments:
నమస్కారములు
అవును ముందు డబ్బు సంపాదించ డానికి కష్ట పడాలి .పిమ్మట దానిని కాపాడటానికి కష్ట పడాలి అసలు డబ్బు ఎక్కువ ఉంటే రాబందుల మధ్యన ఉన్నట్టే . బంగారంలాంటి విషయం చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.