జైశ్రీరామ్.
శ్లో. వేదమూల మిదంజ్ఞానం ,భార్యామూల మిదం గృహం
కృషిమూల మిదం ధాన్యం , ధనమూల మిదం జగత్.
గీ. వేదమూలమ్ము జ్ఞానమ్ము విజ్ఞులార.
గీ. వేదమూలమ్ము జ్ఞానమ్ము విజ్ఞులార.
గృహిణి మూలమ్ము గృహమౌను మహితులార!
కృషియె మూల మీదినుసుకుగణ్యులార!
ధనమె మూల మీజగతికి మనుజులార!
భావము. జ్ఞానానికి వేదమే మూలం.ఇంటికి ఇల్లాలే మూలం.ధాన్యానికి వ్యవసాయమే మూలం.ఈ జగత్తుకు ధనమే మూలం.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నిజమే డబ్బుతో ఏదైనా కొనుక్కోవచ్చును ఒక్క ప్రేమను తప్ప బాగుంది .మంచి సూక్తి
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.