జైశ్రీరాం.
శ్లో. స్వయం
మహేశః , శ్వశురో
నగేశః , సఖా
ధనేశశ్చ , సుతో
గణేశః
తథాపి భిక్షాటనమేవ శంభోః, బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా !
తథాపి భిక్షాటనమేవ శంభోః, బలీయసీ కేవలమీశ్వరేచ్ఛా !
క. తానీశుఁడు,
మామగపతి
మానిత ధనపతి హితుడగు. మాన్య గణేశుం
డానిటలలోచను సుతుం
డైనను భిక్షాటనంబె. యిది విధి బలమే.
భావము. తాను
స్వయంగా మహేశ్వరుడు! మామగారా
- పర్వతాధీశ్వరుడు!
స్నేహితుడా - ధనాధిపతియైన
కుబేరుడు!కుమారుడా
-గణేశ్వరుడు! అయినా
శివునకు భిక్షాటనం తప్పలేదంటే ,కేవలం ఈశ్వర
సంకల్పమే. ఇది ఎంత బలీయమైనది!
జైహింద్
1 comments:
నమస్కారములు
శని నన్నెందుకు పడుతుందని వెళ్ళి చెట్టు తొఱ్ఱలో కూర్చున్నాడట మరి వెండి కొండ మీద కైలాసంలో హాయిగా ఉండవలసిన వెఱ్ఱి శివుడు చెట్టు తొఱ్ఱ లో ఉండటం శని గాక మరేమిటి ? తిరిప మెత్తడం అంతే కదా ? దేవుని లీలలు ఎన్నగలమా ? మంచి విషయాన్ని చెప్పారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.