జైశ్రీరాం
శ్లో. అశ్వం నైవ , గజం నైవ , వ్యాఘ్రం నైవ చ నైవ చఅజాపుత్రం బలిం దద్యాద్దేవో దుర్బలఘాతక: !
క. బలియివ్వరు అశ్వంబును
బలియివ్వరు గజము వ్యాళ వ్యాఘ్రంబులిలన్
బలియిత్తురజంబు నహో!
బలహీనునె బలి యొనరుచు పరమాత్ముండున్
భావము. లోకంలో ఎంతో బలం ఉన్న గుఱ్ఱాన్నికాదు, ఏనుగును కాదు, పులిని కానేకాదు , కేవలం బలం లేని ఒక మేకపిల్లను బలి ఇస్తారు. దైవం కూడా దుర్బలురనే హింసిస్తాడు కాబోలు !
జైహింద్.
1 comments:
నమస్కారములు
అవును బలవంతులు ఏదో రీతిగా గెలుచు కుంటారు .బలహీనులేకదా అన్నీ భరించి అణిగిపోతారు . చక్కని ఆణి ముత్యాన్ని అందించారు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.