జైశ్రీరామ్.
శ్లో. దేహదండనమాత్రేణ కా ముక్తిరవివేకినాం - వల్మీక తాడనాదేవ మృతః కుత్ర మహోరగః ?గీ. పుట్టపై కొట్టినంతలో పుట్టలోని
పాముమరణించబోదుగా! పాంసనుండు
మనసులోనుండు మలినము బాప కుండ
దేహదండన ఫలమీదు. తెలియుఁడయ్య..
భావము. (మనస్సులోని మాలిన్యాన్ని తొలగించుకోకుండా)శరీరాన్ని (ఉపవాసాదులతో) దండింపజేసుకొన్నంత మాత్రాన అవివేకులకు ముక్తి ఎక్కడిది ? పుట్టను ధ్వంసం చేసినంత మాత్రాన దానిలోని మహాసర్పం మరణిస్తుందా !
జైహింద్
1 comments:
నమస్కారములు
నిర్మల మైన మనస్సుతో ఒక్కనమస్కారం పెడితే చాలు కలుషిత బుద్ధితో ఎన్ని పూజలు ఉపవాసాలు చేసినా వృధా ప్రయాసె అవుతుంది మేలిమి బంగారం మన ఆంధ్రామృతం హేట్సాఫ్
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.