గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఏప్రిల్ 2014, మంగళవారం

గృహం తు గృహిణీహీన మరణ్య సదృశం భవేత్ - మేలిమి బంగారం మన సంస్కృతి 168.

జైశ్రీరాం.
శ్లో.న గృహం గృహమిత్యాహుః , గృహిణీ గృహముచ్యతే
గృహం తు గృహిణీహీన మరణ్య సదృశం భవేత్ !
ఆ. గృహము గృహము కాదు గృహిణి లేకున్నచో
గృహిణి యున్నయదియె గృహము. నిజము.
అట్టి గృహిణి మనసు నరసి వర్తించుచు
ముదముఁ గూర్చవలయు ముద్దుచేసి. 
భావము. కేవలం ఒక ఇల్లు “ ఇల్లు ” కాదు. సమర్ధించే ఇల్లాలుంటేనే అది , “ఇల్లు” అనిపించుకుంటుంది. ఇల్లాలు లేని ఇల్లు అడవితో సమానం!
జైహింద్  
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
అవును " ఆడది లేని ఇంట ఆరిపోయిన వంట అన్నారు " గృహిణి ఉంటేనే అది గృహము బాగుంది మంచి మాట ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.