గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా’ మీ పూరణము మనోరంజకమగును గాక.

జైశ్రీరామ్.
సోదరీ సోదరులార! అభివాదములు.
‘మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ. నన్ను నమ్ముమా!
ఈ సమస్యా పూరణమున మీరు కనబరొచే నిపుణత రచయితలకు మార్గదర్శము కాగలదని ఆశించుచుంటిని.   ద్వ్యక్షర గతితో  మీ పూరణము సాగినచో మిక్కిలి మనోరంజకముగా నుండ గలదని అశించు చున్నాను. నేనును పూరింప ప్రయత్నించాను.
చూడండి.

మామన మేన మామె. నను మన్నన నెన్ను మనన్ మనమ్ము. మా
మామ ననూన మన్ననను మన్మనమున్ మును మున్నె మొన్ననే
నేమమునెన్ను నన్ను మననీనని మామ మనమ్మునెన్నె. మా
మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

15 ఫిబ్రవరి 2013 4:36 PM
 రాజేశ్వరి నేదునూరి అన్నారు...
ఏమని జెప్పుదున్ వినగ నీకభి మానము పెంపు జేయగా
నామది నిండుగా దెలిపి నౌరుగ మెప్పును పొంద గోరితిన్
నీమము వీడి నెమ్మికను నేరము లెంచక సంత సంబునన్
మామమ నమ్మునున్న ననుమానము మానుము నన్ను నమ్ముమా !
మీ పూరణముల కొఱకు ఎదురుచూస్తున్నాను.

జైహింద్.
Print this post

4 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మామన మేన మామె. నను మన్నన నెన్ను మనన్ మనమ్ము. మా
మామ ననూన మన్ననను మన్మనమున్ మును మున్నె మొన్ననే
నేమమునెన్ను నన్ను మననీనని మామ మనమ్మునెన్నె. మా
మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

యేమని జెప్పుదున్ వినగ నీకభి మానము పెంపు జేయగా
నామది నిండుగా దెలిపి నౌరుగ మెప్పును పొంద గోరితిన్
నీమము వీడి నెమ్మికను నేరము లెంచక సంత సంబునన్
మామమ నమ్మునున్న ననుమానము మానుము నన్ను నమ్ముమా !

Pandita Nemani చెప్పారు...

అయ్యా! శుభాశీస్సులు. మన వర్ణములతో చిత్రకవిత్వమును చక్కగా చెప్పేరు. అభినందనలు. మీ సాటి ఎవరు రాగలరు? స్వస్తి.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

మామను మామ మామయని మామను పిల్చుట మానలేను నా
మామకు నేను యన్న నభిమానము మానము మేము పల్కుటన్
మామన మేన మామ మరి మానము పోవునె మాటలాడినన్
మామ! మనమ్ము నున్న ననుమానము మానుమ నన్ను నమ్ముమా!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.