గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, ఫిబ్రవరి 2013, శుక్రవారం

జయతు జయతు దేవో దేవకీ నందనోஉయం

జైశ్రీరామ్.
శ్లో:-
జయతు జయతు దేవో దేవకీనందనోయం 
జయతు జయతు కృష్ణో వృష్ణివంశప్రదీప:!
జయతు జయతు మేఘశ్యామల: కోమలాంగో 
జయతు జయతు పృథ్వీభారనాశో ముకున్ద:!!  
గీ:-
దేవకీ నందనా! కృష్ణ దేవ! జయము.
వృష్ణి వంశ ప్రదీప! శ్రీ కృష్ణ జయము.
కోమలాంగాశిత బాల గోప జయము.
పృథ్వి దుర్భార దూర శ్రీ కృష్ణ జయము.
భావము:-
దేవకీ కుమారుడైన దేవదేవునికి జయము జయము! వృష్ణి వంశ ప్రదీపుడైన శ్రీ కృష్ణునికి జయము కలుగు గాక! మేఘశ్యామలుడు, కోమలాంగుడూ అయిన కృష్ణ భగవానునికి జయము జయము! భూమాత భారాన్ని తగ్గించడానికి అవతరించిన ముకుందునికి జయము జయము!
జైహింద్.
Print this post

5 comments:

Pandita Nemani చెప్పారు...

జయము జయము దేవ దేవ! జయము దేవకీసుతా!
జయము వృష్ణివంశ దీప! జయము కృష్ణ! శ్రీధరా!
జయము మేఘ నీలగాత్ర! జయము కోమలా! హరీ!
జయము సుందరా! ముకుండ! జయము భూభరాపహా!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

యెప్పటి కప్పుడు చిక్కగ [చక్కని ]
మెప్పించెడి రచన లెన్నొ మేలగు శుభముల్ !
నొప్పింపక తానొవ్వక
గుప్పిం తురు శ్రీ చింత వారు కూరిమి తోడన్ !

ఎల్లప్పుడూ ఇలాగే రస రమ్య మైన రచనలను మాకందించ గలరని కోరుతూ ఆశీర్వ దించి అక్క

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తమ్ముడూ !
ఓక వేళ చివరి పాదం దోషం ఉంటే ఇలా సవరించ గలరు
" గుప్పింతురు చింతా విజయులు కూరిమి తోడన్ "

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

జయము! దేవకీ నందన! చక్రి కావ
జయము! వృష్ణివంశ ప్రదీప! జయము!జయము!
జయము! కోమలాంగా! మేఘశ్యామ! జయము!
జయము! భూభార మడగించు సన్నుతాంగ!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

పండిత నేమాని వారు,
శ్రీమతి రాజేశ్వరక్కయ్య గారు,
శ్రీ కొంపెల్ల వంశ వారాశి చంద్రులు చల్లగా తమ భావనలను ప్రకటించినందులకు ధన్యవాదములు.
శ్రీమతి రాజేశ్వరి అక్కయ్య శ్రీ అనే అక్షరం చేర్చకుండా వ్రాసి ఉంటేనే ఆత్మీయతతో అలరారుతుందనిపిస్తోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.