గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, ఫిబ్రవరి 2013, గురువారం

ప్రపంచ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
మిత్రులారా! ప్రపంచ మాత్రు భాషా దినోత్సవము సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
ముఖ్యముగా తెలుగును మాతృ భాషగా కలవారికి అభినందనలు.
తెలుగు పలుకులందుగల జిగి బిగి నెఱిగి అందలి నిగనిగలను వెలువరింప చేసి, అత్యుద్భుతమైనది తెలుగు భాషే అని నిరూపించడానికి తెలుగువారంతా సమైక్యం కావాలి. వైవిధ్యాలు విడనాడాలి. భాషాభిమానం పెల్లుబకాలి. మాతేఉ భాషలోనే భాషణ చేయాలి.భాషలోని మాధ్ర్యాన్ని చవి చూడడంతో పాటు ప్రపంచానికి చాటాలి.
ఇంతటి బాధ్యత మనపై ఉంది. మరువకండి. మనం ఉన్నది నిజమైతే, అంటే మన అస్తిత్వం నిజమైతే  దానికి మూలమైన తెలుగు మాతృ భూమియొక్క ఔన్నత్యము, తెలుగు మాతృభాష యొక్క అసాధారణ ప్రతిభ ముందుగా మనం మననం చేసుకోవాలి. తదనంతరం మన మహత్తర గ్రంథరాజములందున్న కవితామృతఝరిలో తోటి వారిని ఓలలాడించాలి. అది చెయ్యాలంటే ముందుగా మనకు మనం మన మాతృభాష అయిన తెలుగుపై పట్టు సాధించాలి. అందుకొఱకు నిరంతరం అకుంఠిత దీక్షతో కృషి చెయ్యాలి. అప్పుడే మన అస్తిత్వానికొక అర్థం ఉంటుంది. మన ప్రతిభా పాటవాలు ప్రపంచానికి తెలుస్తాయి.
మీరేమంటారు?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.