గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

12, ఫిబ్రవరి 2013, మంగళవారం

ఈ సమస్యను పూరించే సమర్థులు మీరు కాక మరెవరు?

జైశ్రీరామ్.
ప్రియ ఆంధ్రామృతాభిమానులారా!
ఈ క్రింది సమస్యను మీరైతే సున్నాయాసంగా పూరించ గలరని నమ్ముతున్నాను. వ్రాసి పంపండి.
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!
నా పూరణమును వ్యాఖ్యలో పరికించండి.
జైహింద్.

Print this post

9 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చ:-
గరువము పెచ్చు రేగుటను కన్నును మిన్నును గాన కుండుటన్
నిరుపమ మైన వీరుడను. నేలను కూల్చెద నెట్టి మల్లునం
చరచుచు మల్ల యుద్ధమున నావలి మల్లుని చేత చిక్కె తా.
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పరసతి మీది మోహమతి పాపము ,దైవబలంబు కూడియున్
సరిపడదీ దురాగతము ,శైవవరాంథుడు బాహు గర్వితా
సురపతి రావణాసురుడు చూడుడు ! రాముని పత్ని దెచ్చి తా
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పరసతి మీది మోహమతి పాపము ,దైవబలంబు కూడియున్
సరిపడదీ దురాగతము ,శైవవరాంథుడు బాహు గర్వితా
సురపతి రావణాసురుడు చూడుడు ! రాముని పత్ని దెచ్చి తా
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

రాజారావు గారూ! మీపూరణ చాల బాగున్నది. సర్వకాలీన సత్యాన్ని చెప్పారు. అభినందనలు.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

తెలుగు పద్యమందు తెలియని యభిమాన
మొకటి దప్ప నేమి యొప్పు లేదు
మెప్పు మీ సుగుణము మిత్రమా ! ధన్యవా
దములు శర్మగారు ! విమల మతులు

సాహిత్యాభిమాని చెప్పారు...

ఎంత చక్కనిదోయి ఈ తెనుగు తోట
ఎంత పరిమళమోయి ఈ తోట పూలు !!!!!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

పరువము నందు మోదమున పాపము లెన్నియొ జేసి నట్టియా
గరువము తోన సోదరుల గాంచగ లేకను రాజ్య కాంక్షతోన్
పరమ యుదాత్తు డైన కురు పాండవు నోడె కసాయి జూదమున్
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యాడెనే !

తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

నెరపున కౌరవాధిపుని నెంజలి దీర్ప విరాత కూటమ
ల్లరులట నొక్క రొక్కరుగ లావున గూలగ వల్లవుండు సం
వరణపు భీమసేనుడు నివారణ చేయగ వాని నంతటన్
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే!

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ. చెప్పారు...

నెరపున కౌరవాధిపుని నెంజలి దీర్ప విరాట కూట మ
ల్లరులట నొక్కరొక్కరుగ లావున గూలగ వల్లవుండు సం
వరణపు భీమసేనుడు నివారణ చేయగ వాని నంతటన్
వెరవును లావు చేవయును వీరము బీరము గల్గి యోడెనే !

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.