గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, ఫిబ్రవరి 2013, ఆదివారం

మాతృభాషా వైభవం సాహితీ కార్యక్రమం.

జైశ్రీరామ్.
సాహితీ సంపన్నులారా! ప్రపంచ మాతృభాషా దినోత్సవము సందర్భమును పురస్కరించుకొని  ఈ రోజు చిక్కడపల్లిలో గల త్యాగరాయ గాన సభలో సహస్ర పద్య కంఠీరవ బిరుదాంకితులు శ్రీ చిక్కా రామ దాసు ఆధ్వర్యవమున నడచుచున్న తెలుగు సాహిత్య కళా పీఠము వారు మాతృభాషా వైభవము పేర సాహితీ సభ నిర్వహించిరి.
ఈ కార్యక్రమమునకు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ రిజిష్ట్రార్ ప్రస్తుతం అధికార భాషా సంఘం సభ్యులు అయిన ఆచార్య గౌరీశంకర్ గారు అధ్యక్షత వహించారు.
కేంద్రీయ విశ్వ విద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య శరజ్జ్యోత్స్నారాణిముఖ్య అతిథిగా, డా.తిరునగరి, శ్రీ సాధన నరసింహాచార్యులు, శ్రీ సుర్వి గణేష్ గౌడ్, ప్రసిద్ధ కవి, వాగ్గేయ కారుడు శ్రీ గోరటి వెంకన్ననృత్య కళా శిరోమణి శ్రీమతిసరితా దిలీప్,త్యాగరాయ గాన సభ అధ్యక్షులు శ్రీకళా వేంకట దీక్షితులు, శ్రీ రాధాశ్రీ, పాల్గొన్నారు.
తెలుగు భాషా ప్రాశస్త్యమును గూర్చి నేను, నాతో పాటుగా శ్రీ తల్లోజు యాదవాచార్యులు, శ్రీ వేముల ప్రభాకర్, శ్రీ రాపోలు వేంకటేశం, శ్రీ బాలవర్ధి రాజు, శ్రీ పెసరు లింగారెడ్డి, శ్రీ వేముల సత్యనారాయణ, శ్రీ చిన్నం అంజయ్య, శ్రీ సుందర రామ కృష్ణ,  శ్రీమతి పాణ్యం మీనాకుమారి, శ్రీమతి బి.నె౩ఎలిమ, శ్రీమతి జ్యోషి అరుణశ్రీ, మున్నగు వారు చేసిన పద్య పఠనం సభాసదుల మన్ననలను పొందాయి. ఈ కార్యక్రమమునకు సంబంధించిన ఛాయాచిత్రములు తిలకించ వచ్చును.
జ్యోతిప్రజ్వలన.
తెలుగు సాహిత్య కళా పీఠం అధ్యక్షులు పలుకుచున్న స్వాగతం.
అధ్యక్షోపన్యాసము చేయుచున్నఅధికార భాషా సంఘ సభ్యులు ఆచార్య టి.గౌరీశంకర్.
శ్రీ సుందర రామ కృష్ణ పద్య పఠనము.
నేను చేయుచున్న పద్య పఠనము.
ఆచార్య గౌరీశంకర్ గారు నన్ను సత్కతిస్తున్న సన్నివేశము.
4నందీపురస్కారములందుకొన్న నృత్యకళాశిరోమణి శ్రీమతిసరితాదిలీప్ ఉపన్యాసము.
ఆర్యులారా! చూచారు కదా! మన మాతృభాషాభిమానాన్ని పెంచే ప్రయత్నంలో శ్రీ చిక్కా రామదాసుగారు ఎందరెందరినో ఆదరాభిమానాలతో ఆహ్వానించి, సముచిత సత్కారం చేసి, వారి ద్వారా తెలుగు భాషాభిమానులకానందం పంచారు. అట్టి ప్రయత్నం సత్ఫలాలనిస్తుందని ఆశిద్దాం.ఆ సభలో నేను చేసిన కవితా గానాన్ని అతి త్వరలో మీముందుంచగలనని సవినయముగా మనవిచేసుకొనుచున్నాను. శుభమస్తు.
జైహింద్. 
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
సాహితీ కార్యక్రమ వివరాలను తెలియ జేసి నందుకు కృతజ్ఞతలు .

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.