సీ:-
ఆతడంబకు మగం డీత డమ్మకే మగం – డెలమి నాతని కంటె నితడె ఘనుడు.
అతడు శూలము త్రిప్పు నితడు వాలము త్రిప్పు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.
అతడు అమ్మున వ్రేయు నితడు కొమ్మున దూయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.
అతడు సృష్టిని మోయు నితడతనినె మోయు - నెలమి నాతని కన్న నితడె ఘనుడు.
తే.గీ:-
శూలి యాతడు కాపుల కూలి ఇతడు. – దేవూడాతడు కుడితంత దేవు నితడు
ఈశ్వరుని యన్నిటను మించు నెద్దు గాదె? - ఎద్దు లేకున్న కదలలే డీశ్వరుండు.
జైహింద్.
6 comments:
రామకృష్ణ గారూ, పద్యం అద్భుతం గా ఉంది. కృతికర్త మీరేనా?
ఈ పద్యం తెనాలి రామకృష్ణయ్య, మొల్ల రాసిన ఓ పద్యాన్ని హేళన చేస్తూ వ్రాశాడు అని చదివాను.
అయ్యా! శ్రీపతి సనత్కుమార్ గారూ! ఈ పద్యం ఒక చాటువు. రచయిత ఎవరో తెలిదు కాని నాలుగవ పాదం మాత్రం నేనే కూర్చాను.
గంగిరెద్దుల వారు ఈ పద్యం చదివేవారని ప్రతీతి. రవిగారు ఈ పద్యం తెనాలి రామకృష్ణ, మొల్ల వ్రాసిన పద్యానికి హేళన పద్యమై యుంటుందని వ్రాసిరి. ఐయుండొచ్చు.
ఈ పద్యం వెనుక (నేను చదివిన) కథ ను వీలున్నప్పుడు నా బ్లాగులో రాస్తాను.
మాస్టారు గారు, ఇదుగో ఇక్కడ వ్రాసానండి.
చాలా బావుంది రామకృష్ణ గారూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.