జైశ్రీరామ్.
ప్రస్తుతం ఉన్న అష్టావధాన, శతావధాన, ప్రక్రియలకు రూపకల్పన చేసినవారు శ్రీమాన్ మాడభూషి వేంకటాచార్యులు(1835 - 1895). వీరు వైష్ణవబ్రాహ్మణులు, కౌశికగోత్రులు మరియు ఆపస్తంబసూత్రుడు. వీరి తల్లి: అలివేలమ్మ మరియు తండ్రి: నరసింహాచార్యులు. వీరు నూజివీడు లో 1835 లో ఫిబ్రవరి 22న జన్మించారు. వీరి నిధనము: 1895-మన్మథ నామ సంవత్సర ఫాల్గుణ బహుళ తృతీయ. ఈ మాడభూషి వేంకటేశ్వరరావు గారి జన్మదినమయిన ఫిబ్రవరి యిరవై రెండవ తేదీని ప్రపంచ అవధాన దినంగా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభిత్వమునకు, మత్రివర్యులు శ్రీ ధర్మాన ప్రసాదరావు మహోదయులకు ధన్యవాదపూర్వక నమస్సులు.
అవధాన విద్యా వర్ధతామ్.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.