గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, డిసెంబర్ 2022, బుధవారం

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణ - ...17 - 9...//...యాతయామం గతరసం పూతి - ...17 - 10,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

 జైశ్రీరామ్

|| 17-9 ||

శ్లో.  కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః|

ఆహారా రాజసస్యేష్టా దుఃఖశోకామయప్రదాః. || 

తే.గీ.  కటువు నామ్లము, లవణము, కలిగి యతిగ

పొడిగ, వేడికారాలతో, కడకురోగ

దుఃఖమునుగొల్పువాటినే ధూర్తగుణులు

రాజసికులిష్టపడుదురు రాజ! పార్థ!

భావము.

చేదూ, పులుపూ, ఉప్పూ, వేడీ, కారమూ, అన్నీ అతిగా కలిగి, పొడిపొడిగా 

ఉండి, దాహం పుట్టిస్తూ, దుఃఖాన్నీ, శోకాన్నీ, రోగాన్నీ కలిగించేవి 

రాజసికులకు ఇష్టం.

|| 17-10 ||

శ్లో.  యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్|

ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్. 

తే.గీ.  పాసిపోయిన, రుచిచెడ్డ వాసనగల

యెంగిలైనవి తిననెంత్రు యింగితమును

పూర్తిగా వీడి తామసుల్ మూర్ఖులగుచు

నీవు గ్రహియింపుమర్జనా నేర్పు మీర. 

భావము.

వండిన తరువాత ఝాము దాటి పోయినదీ, రుచి పూర్తిగా పోయినదీ, పాసిపోయినదీ, వాసన గొట్టుతుందీ, ఎంగిలిదీ, అశుభ్రమైనదీ అయిన భోజనం తామసికులకు ఇష్టం.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.