24, డిసెంబర్ 2022, శనివారం
అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్ - ...17 - 11...//...అభిసన్ధాయ తు ఫలం - ...17 - 12,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము
జైశ్రీరామ్
శ్లో. అఫలాఙ్క్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే|
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః. || 17-11 ||
తే.గీ. ఫలితమాశించకయె ధర్మ మెలయ కర్మ
శాస్త్ర విహితమున్ జేయుట సాత్వికమగు
యజ్ఞ మగునర్జునా! కనుమహర్నిశములు
ధర్మబద్ధతన్ వర్తింప ధరణిపైన.
భావము.
ఫలాపేక్ష లేకుండా, శాస్త్రాలలో విధింపబడిన ప్రకారంగానూ, తను ఆ కర్మ చేయడం కర్తవ్యమనే స్థిర చిత్తంతో చేయబడే యజ్ఞం సాత్విక యజ్ఞం.
శ్లో. అభిసన్ధాయ తు ఫలం దమ్భార్థమపి చైవ యత్|
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్. || 17-12 ||
తే.గీ. ఫలమునాశించి చేయుట, మలిన మతిని
దంబమునకయి చేయుట తగదు యజ్ఞ
కర్మ, రాజసయజ్ఞమౌ కనగనదియు,
నీవు గ్రహియింపుమర్జునా నేర్పుమీర.
భావము.
అర్జునా! ఫలాన్ని ఆశిస్తూనో, డంభం కోసంమో చేయబడే యజ్ఞం
రాజసిక యజ్ఞం అని తెలుసుకో.
జైహింద్.
Print this post
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.