జైశ్రీరామ్.
సప్తదశోధ్యాయః - శ్రద్ధాత్రయవిభాగయోగః
అర్జున ఉవాచ|
భావము.
అర్జునుడనుచున్నాడు.
|| 17-1 ||
శ్లో. యే శాస్త్రవిధిముత్సృజ్య యజన్తే శ్రద్ధయాన్వితాః|
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః.
తే.గీ. శాస్త్రమును వీడి, నిన్నె తా శ్రద్ధతోడ
కొలువ నాసేవ యేమగు కూర్మి జెపుమ
సాత్వి కమొతామసమొరాజసంబొ కృష్ఢ!
తెలుయ జెప్పుమునాకీవు దివ్య తేజ!
భావము.
కృష్ణా! ఎవరైనా శాస్త్ర విధిని వదిలిపెట్టి శ్రద్ధతో ఆరాధిస్తే వాళ్ళ నిష్ట ఎలాంటిది?
సాత్వికమా, రాజసికమా, తామసికమా?
శ్రీభగవానువాచ|
భావము.
శ్రీ భగవానుడనుచున్నాడు.
|| 17-2 ||
శ్లో. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా|
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు.
తే.గీ. శ్రద్ధ సత్వరజస్తమ రమ్య తేజ
ములను మనుజుల నుండును, పుట్టినపుడె
యుండునవి నీవెరింగిననొప్పిదముగ
నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.
భావము.
మనుష్యుల శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అని మూడు విధాలుగా
ఉంటుంది. అది స్వభావం నుండి జనిస్తుంది. వాటిని గురించి విను.
జైహింద్
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.