గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2022, సోమవారం

అశాస్త్రవిహితం ఘోరం - ...17 - 5...//...కర్షయన్తః శరీరస్థం - ...17 - 6,,,//.....సప్తదశోధ్యాయము - శ్రద్ధాత్రయవిభాగయోగము

జైశ్రీరామ్.

|| 17-5 ||

శ్లోఅశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః|

దమ్భాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః. 

తే.గీప్రబల కామరాగములతో వరలుచుండి

యహముదంబంబులనగల్గియహరహంబు,

శాస్త్రమొప్పని, చెడుగొల్పు సద్విరుద్ధ

తపము చేసెడివారుంద్రు ధరణిపైన.

భావము.

దంభాహంకారాలతో, ప్రబలమైన కామరాగాలతో కూడి శాస్త్ర విరుద్ధమైన

పీడా కరమైన తపస్సు చేసే వారూ,

|| 17-6 ||

శ్లోకర్షయన్తః శరీరస్థం భూత గ్రామమచేతసః|

మాం చైవాన్తఃశరీరస్థం తాన్విద్ధ్యాసురనిశ్చయాన్

తే.గీ. తెలివిమాలి జీవకణాళి, దేజమయిన

నన్ను హింసింతురాసుర మున్న జనము

లసురనిశ్చయులనియెంచుమట్టి వారి

కిహము పరమును చెడిపోవు, మహిత! కనుమ.

భావము.

తెలివి తక్కువగా శరీరంలోని జీవకణాలనూ, శరీరంలో ఉండేనన్ను కూడా 

హింసించే వాళ్ళు అసురిక నిశ్చయం కలవారని తెలుసుకో.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.