జైశ్రీరామ్.
|| 16-21 ||
శ్లో. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః|
కామః క్రోధస్తథా లోభస్తస్మాదేతత్త్రయం త్యజేత్.
తే.గీ. ఆత్మనాశనహేతువు లరయ మూడు
కామమున్క్రోధలోభముల్, కాన నరుడు
విడువగావలె మూడిటిన్, విజ్ఞత గలి
గి, కను మర్జునా సత్యంబు ప్రకటితమవ.
భావము.
ఆత్మ నాశనానికి దారి తీసే నరక ద్వారాలు మూడు-కామం, క్రోధం,
లోభం. అందుచేత ఈ మూడింటిని త్యజించాలి.
|| 16-22 ||
శ్లో. ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారైస్త్రిభిర్నరః|
ఆచరత్యాత్మనః శ్రేయస్తతో యాతి పరాం గతిమ్.
తే.గీ. నరకమార్గ మీ మూటిని నరుడు విడువ
శ్రేయమునుగొల్పు కర్మలే చేయుచుండు,
పరమగతిపొందునాతడు నరకము విడి
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
కౌంతేయా! నరక ద్వారాలైన ఈ కామ క్రోధ లోభాలు మూడింటి నుండి
విడుదల పొందిన నరుడు, తనకు శ్రేయస్సును కలిగించే కర్మలు చేస్తాడు.
దాని వలన పరమగతిని పొందుతాడు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.