గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2022, గురువారం

యః శాస్త్రవిధిముత్సృజ్య - ...16 - 23...//....ఏతైర్విముక్తః కౌన్తేయ తమోద్వారై- , , .16 -24,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

జైశ్రీరామ్.

 || 16-23 ||

శ్లో.  యః శాస్త్రవిధిముత్సృజ్య వర్తతే కామకారతః|

న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిమ్.

తే.గీ.  కోరికలు పెచ్చి శాస్త్రమున్ దూరి దురిత

వర్తులిల కార్య విఫలులై బాధితులగు,

సుఖము, పరగతి దూరమౌచు వెతలందు,

చుందురో యర్జునా!మది యందు కనుము.

భావము.

తన కోరికల కారణంగా శాస్త్రాన్ని ఉల్లంఘించి ప్రవర్తించిన వాడు 

కార్యసిద్ధిని పొందడు. సుఖాన్ని పరమగతిని కూడా పొందడు.

|| 16-24 ||

శ్లో.  తస్మాచ్ఛాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యవ్యవస్థితౌ|

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి.

తే.గీ.  శాస్త్రమాధారమిచ్చట చక్కగగొని

మంచి త్రోవలో నడచిన మంచి జరుగు,

శాస్త్రమును గాంచి వర్తించ చక్కగాను

ముక్తిమార్గంబు నందుట పొసగు పార్థ!

భావము.

అందుచేత కర్తవ్యాన్ని, అకర్తవ్యాన్నినిర్ధారించుకోవడానికి శాస్త్రం ప్రమాణం. 

శాస్త్రం చెప్పిన విధిని తెలుసుకుని ఇక్కడ నీవు కర్మ చెయ్యడం మంచిది.

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు

బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

దైవాసురసమ్పద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.