జైశ్రీరామ్.
శ్లో. విధిహీనమసృష్టాన్నం మన్త్రహీనమదక్షిణమ్|
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. || 17-13 ||
తే.గీ. శాస్త్రవిధిలేక, మంత్రముల్ శ్రద్ధ లేక,
యన్నదానంబు చేయక, మన్ననమున
దక్షిణేమాత్రమీయక, ధాత్రి జేయు
యజ్ఞ మదితామసికమను యజ్ఞమరయ.
భావము.
శాస్త్ర విధి లేకుండా అన్నదానం చేయకుండా, మంత్రాలు లేకుండా, దక్షిణ ఇవ్వకుండా, శ్రద్ధ లేకుండా చేయబడే యజ్ఞం తామసిక యజ్ఞం
అని చెప్పబడుతుంది.
శ్లో. దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్|
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. || 17-14 ||
తే.గీ. గురుల, దేవతలన్, బ్రాహ్మకులజుల నిల
పండితుల బూజ చేయుట, బ్రహ్మచర్య
ము, శుచి, రుజువర్తనంబును, ముక్తిదమగు
నట్టి శారీరకతపస్సు, నరయుమయ్య.
భావము.
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, విద్వాంసులను పూజించడం, శుచిత్వం, సూటియైన ప్రవర్తన, బ్రహ్మచర్యం అహింస ఇవి శారీరక తపస్సులు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.