జైశ్రీరామ్.
|| 16-11 ||
శ్లో. చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితాః|
కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః.
తే.గీ. కామభోగంబులవధిగా కలుగువారు,
జన్మకడదాక పాపులై జగతిమెలగి
నరకమును చేరుచుందురాసురగుణులిల
నీవు గ్రహియింపుమర్జునా నేర్పు మీర.
భావము.
వాళ్ళు మరణించే వరకు అపరిమితములైన యోచనలలో మునిగి తేలుతూ,
కామ భోగాలు తప్ప జీవితానికి వేరే లక్ష్యం లేదని నిశ్ఛయించుకున్న వాళ్ళు.
|| 16-12 ||
శ్లో. ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః|
ఈహన్తే కామభోగార్థమన్యాయేనార్థసఞ్చయాన్.
తే.గీ. అంతులేనట్టి యాశలనలమటింత్రు,
కామమునకును వశులయి భూమిపైన
ధనము కామాదులకునయి తగలబెట్టు
చుందుర్జునా! లేకయే ముందుచూపు.
భావము.
వాళ్ళు వందలాది ఆశా పాశాలతో కట్టుబడి, కామక్రోధాలకు వశులై
తమ కామభోగానికిగాను, అన్యాయంగానైనా సరే సంపదలను
సమకూర్చుకోవాలని అనుకుంటారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.