జైశ్రీరామ్
|| 16-9 ||
శ్లో. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః|
ప్రభవన్త్యుగ్రకర్మాణః క్షయాయ జగతోऽహితాః.
తే.గీ. ఇట్టి దుర్భావపూర్ణులై కౄరగతిని
ధర్మదూరులై పాపులై ధరణిపైన
మంచినణచుచు వంచనన్ మసలుచుందు
రాసురంబున చెడుచుంద్రు ధీసమేత!
భావము.
ఈ దృష్టినే పట్టుకుని వేలాడుతూ వీళ్ళు ధర్మ భ్రష్టులై సంకుచిత బుద్ధులై,
ప్రపంచానికి శత్రువులై, కౄరకర్ములై లోక నాశనం కోసం పుడతారు.
|| 16-10 ||
శ్లో. కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః|
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్ప్రవర్తన్తేశుచివ్రతాః.
తే.గీ. తృప్తిచెందనం తాశలో తేలుచుంద్రు
దంభ, మాన, మదంబులన్, దారి తప్పి
సత్యదూరమౌ మిధ్యపై సతము మసలి
పాపవర్తులై చెడుదురు లోపమదియె.
భావము.
వాళ్ళుతృప్తి పరచడానికి వీలులేనంత కోరికలను పెట్టుకొని దంభ, మాన,
మదాలతో నిండి, భ్రాంతి వలన అసత్యమైన వాటి వెంట అనాచారంగా
ప్రవర్తిస్తారు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.