జైశ్రీరామ్.
|| 16-7 ||
శ్లో. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనా న విదురాసురాః|
న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే.
తే.గీ. నిజమిది ప్రవృత్తిని నివృత్తిని నసురగుణు
లెరుగ, రిల శౌచమాచార మెరుగబోరు,
సత్యదూరులై యుందురు సతతమిలను,
నీవు గ్రహియింపుమర్జునా! నేర్పు మీర.
భావము.
అసుర స్వభావం కలవారు ప్రవృత్తిని కాని నివృత్తిని గాని ఎరుగరు. వాళ్ళలో
శౌచమూ, ఆచారమూ, సత్యమూ ఉండవు.
|| 16-8 ||
శ్లో. అసత్యమప్రతిష్ఠం తే జగదాహురనీశ్వరమ్|
అపరస్పరసమ్భూతం కిమన్యత్కామహైతుకమ్.
తే.గీ. జగతి మిధ్యని యిది సహజంబటంచు,
కామమే సృష్టిమూలమై కలిగెననుచు,
పాపపుణ్యధర్మంబులే వరలవనుచు
నసుభావులు తలచెదరనుమముగ.
భావము.
జగత్తు మిధ్య అనీ, దానికి ధర్మా ధర్మాలు ఆధారము ఉండవని, ఈశ్వరుడే
లేడనీ ఈ ప్రపంచములోని ప్రాణులు స్త్రీ పురుషుల కలయిక వలననే
పుట్టినదనీ వారు అంటారు. అందుచేత ఈ జగత్తుకి కారణం కామమే
అంటారు అసుర జనులు.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.