గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, నవంబర్ 2022, గురువారం

తేజః క్షమా ధృతిః శౌచమ - ...16 - 3...//....దమ్భో దర్పోభిమానశ్చ - , , .16 -4,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

 జైశ్రీరామ్.

|| 16-3 ||

శ్లో.తేజః క్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా|

భవన్తి సమ్పదం దైవీమభిజాతస్య భారత.

తే.గీ.  తేజమోర్మియు దీక్షయు, దివ్య శుచియు,

ద్రోహచింతవిదూరత, మోహదూర

తయును, ద్వేషరాగవిదూరతయును, దైవ

లక్షణములు పార్థ! గ్రహించు, లక్ష్యమరసి.

భావము.

తేజస్సు, ఓర్మి, పట్టుదల, శుచిత్వం, ద్రోహచింతన లేకపోవడం, 

అభిమాన రాహిత్యం. . . అర్జునా! ఇవి దైవీ సంపదతో పుట్టిన 

వానికి కలుగుతాయి.

 || 16-4 ||

శ్లో.  దమ్భో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ|

అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్.

తే.గీ.  దంభమభిమాన క్రోధముల్, దర్పము పరు

షతయు, నజ్ఞానమసుర, సహజలక్ష

ణములు, గ్రహియింపు మర్జునా! నయనిధాన!

దైవభావంబునన్ మెల్గ దగును మనము.

భావము.

అర్జునా! దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పరుషత్వం, అజ్ఞానం. . . 

ఈ లక్షణాలు అసుర సంపదతో పుట్టిన వానికి కలుగుతాయి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.