గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, నవంబర్ 2022, శుక్రవారం

దైవీ సమ్పద్విమోక్షాయ - ...16 - 5...//....ద్వౌ భూతసర్గౌ లోకేస్మి - , , .16 -6,,,//.....దైవాసురసమ్పద్విభాగయోగఃము.

 జైశ్రీరామ్

|| 16-5 ||

శ్లో.  దైవీ సమ్పద్విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా|

మా శుచః సమ్పదం దైవీమభిజాతోऽసి పాణ్డవ.

తే.గీ.  మోక్షమిచ్చు దైవీయము పూర్తిగాను,

మహిత సంసార బంధంబు మహిని యసుర

మునను కల్గును మనలకు, వినుము పార్థ!

నీవు దైవాంశజుండవే, నిజము కనుమ.

భావము.

దైవీ సంపద మోక్షానికి, అసుర సంపద సంసార బంధానికి కారణం. అర్జునా! 

విచారించకు, నీవు దైవీ సంపదతోనే పుట్టావు

|| 16-6 ||

శ్లో.  ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్దైవ ఆసుర ఏవ చ|

దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు.

తే.గీ.  దైవమాసురమన్రెండు  జీవకోటి

వరలు, దైవమున్ దెల్పితి, పరగు నసుర

విషయమరయుము తెలిపెద విపులగతిని.

యరసి వర్తింపుమా తగన్ నిరుపమాన!

భావము.

ఈ లోకంలో దైవం, అసురం అని ప్రాణుల సృష్టి రెండు రకాలు. దైవసృష్టిని 

గురించి విస్తారంగా చెప్పబడినది. అర్జునా! అసుర సృష్టి గురించివిను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.