జైశ్రీరామ్
|| 16-17 ||
శ్లో. ఆత్మసమ్భావితాః స్తబ్ధా ధనమానమదాన్వితాః|
యజన్తే నామయజ్ఞైస్తే దమ్భేనావిధిపూర్వకమ్.
తే.గీ. యసురులాత్మస్తుతులు మూర్ఖు లసమదృష్టు
లరయదంబ,ధనమదాంధులనవరతము
నామమాత్రపు యజ్ఞ ముల్ భూమిజేయు
చుందు రనుపమ మూర్ఖులై మందభతులు.
భావము.
తమని తాము మెచ్చుకునే వాళ్ళు, మొండి వారు ధన మాన మదాలతో
కూడుకుని, గుడ్డి వాళ్ళై దంభం కోసం శాస్త్ర పద్ధతిని వర్ణించి నామమాత్రంగా
యజ్ఞాలు చేస్తారు.
|| 16-18 ||
శ్లో. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః|
మామాత్మపరదేహేషు ప్రద్విషన్తోऽభ్యసూయకాః.
తే.గీ. దర్ప బలముల నహమును, ధాత్రి క్రోధ
కామముల నాశ్రయించి, గర్వమొంది,
యంతటన్గలనన్ దిట్టు నట్టివాని
ఆసురంబగు యోనుల నమర విడుతు.
భావము.
అహంకారాన్ని, బలాన్ని, దర్పాన్ని, కామ క్రోధాలను ఆశ్రయించుకొని,
తమలోను, ఇతరులలోను ఉన్న నన్ను ద్వేషించే కౄరులు, దుష్టులు
నరాధములను నేను నిత్యము అసురీ యోనుల్లోకి విసిరేస్తాను.
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.