జైశ్రీరామ్.
బ్రహ్మ శ్రీ పోకూరి కాశీపత్యవధాని గారి గుడుల పద్య ప్రేరణతో శ్రీ కందుల వరప్రసాద్ చిత్రకవి వ్రాసిన (ఇకార} గుడికందము
కందము
తిరిగి తిరిగి దివిని క్షితిని
సిరిని కినిసి నీలిగించి చిక్కి గిరిని ని
ల్చిరి ప్రీతిని విధి బిగినీ
విరించి కీరితి నిధి నిడి బిలిబిలి గ్రీష్మీ!
అర్థం :- బిలిబిలి గ్రీష్మీ! = ముద్దు లొలుకు నవ మల్లిక, దివిని క్షితిని = దేవలోకము, భూలోకములలో, తిరిగి తిరిగి= వెదకి, నీలిగించి= తిండి లేక మాడి, సిరిని కినిసి= లక్ష్మీదేవి ని సమీపించి, చిక్కి= కదలలేక, గిరిని నిల్చిరి = కొండపై నిలచి,
విధి బిగిని = విధి శాపముచే,
ప్రీతిని= ఇచ్ఛ తో, విరించి= విష్ణువు, కీరితి = యశస్సు
నిధి నిడి = స్థానం ఇచ్చెను.
భావము :- ముద్దు లొలుకు నవ మల్లిక,
లక్ష్మీ దేవి కొరకు దేవలోకము, భూలోకములలో వెదుకు విష్ణువు శుష్కించి , లక్ష్మీదేవిని సమీపించి తిరుమల గిరిపై నిలచి, ఆ కొండకు ఇంతటి పేరుప్రఖ్యాతులు కలుగ జేసెను.
జైహింద్.
2 comments:
నమస్కారములు
గుడి కందము చాలా బాగుంది.శ్రీ కందుల వరప్రసాద్ గారికి అభినందనలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
గురుదేవులకు మరియు సహృదయ స్పంధనకు
అక్కయ గారికి పాదాభివందనములు 🙏🙏🙏
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.