జైశ్రీరామ్.
ఆర్యులకు శుభోదయమ్.
నేడు అంతర్ జాతీయ మాతృ భాషా దినోత్సవము.
ఈ సందర్భముగా అందరికీ శుభాకాంక్షలు.
మానవ్వులకు మాతృమూర్తి నిత్యమూ ఆరాధ్యదైవమే అటులనే మాతృమూర్తిద్వారా మనకు లభించిన మాతృభాష కూడా నురంతరమూ ఆరాధించవలసిన దేవత. ఐనప్పటికీ ఒక తిథిని నిర్ణయించి మనలో ఉన్న మాతృభాషాభిమానమును ప్రేరేపించుట జరుగుచున్నందున మనమందరము స్పందించి మాతృ భాషాభిమానమును ద్వుగుణీకృతము చేసుకొని మనవంతు ఋణము తీర్చుకొనవలసియున్నది.
మనము మాతృభాషలోనే మనవారితో మాటాడుట, మాతృభాషాలిపిలోనే వ్రాయుట, చేయుట మూలమున మాతృభాషను జీవభాషగా మనతో పాటు నిలుపుకొన వచ్చును.
మీ అందరికీ మరొక్క పర్యాయము అభినందనలు తెలుపుచున్నాను.
జైహింద్.
వ్రాసినది












1 comments:
నమస్కారములు
అందరికీ శుభాభి నందనలు " మాతృదేవో భవ "
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.