గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, ఫిబ్రవరి 2019, బుధవారం

మల్లికార్జున పండితుడు పాల్కురికి సోమన్న శ్రీశైల మల్లన్నను అచ్చులు, హల్లులతో అక్షరాంక గద్యలో చేసిన స్తుతి.

జైశ్రీరామ్.
మల్లికార్జున పండితుడు పాల్కురికి సోమన్న శ్రీశైల మల్లన్నను
అచ్చులు, హల్లులతో అక్షరాంక గద్యలో చేసిన స్తుతి.

అఖిల లోకాధార
ఆనంద పూర
ఇన చంద్ర శిఖి నేత్ర
ఈడితామల గాత్ర
ఉరు లింగ నిజరూప
ఊర్జితా జలచాప
ఌలిత తాండవకాండ
ౡనికృతా జాండ
ఏకైక వర్యేశ
ఐక్య సౌఖ్యా వేశ
ఓం కార దివ్యాంగ
ఔన్నత్య గుణ సంగ
అంబికా హృదయేశ
అఃస్తోక కలనాశ
కనద హీనాభరణ
ఖల జలంధర హరణ
గల నాయక విధేయ
ఘన భక్తి విజేయ
జశ్చూల కాలధర
చరిత త్రిశూల ధర
ఛర్మ యాధ్వస్త
ఞన గుణ ధళ ధీర
ట త్రయాది విదూర
ఠ ప్రభావాకార
డమరుకాది విహార
ఢ వ్రాత పరిహార
ణ ప్రవాగార
తత్త్వ జోనేత
థవి దూర జవ పక్ష
దవన పాలన దీక్ష
ధరణీ థవోల్లీడ
నంది కేశారూఢ
పర్వతీశ్వర లింగ
బహుళ భూత విలాస
భక్త్వ హృద్వ నహన
మంత్రస్తుతోధార
యక్ష రుద్రాకార
రతిరాజ బిన హంస
లలిత గంగోత్తంస
ళమా విదవ్రంశ
వరద శైల విహార
శర సంభ వాస్ఫార
షట్తింశ తత్త్వగత
సకల సురముని వినుత
హరి నేత్ర పదపద్మ- అంశిత భూధరపద్మ
క్షర రహిత చరిత్ర - అక్షరాంక స్తోత్ర
శ్రీ పర్వత లింగ
నమస్తే నమస్తే నమస్తే నమః.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
మల్లికార్జున స్వామిని " అక్షరాంక గద్యలో చేసిన స్తుతి అద్భుతముగా నున్నది . మాకందించి నందులకు ధన్య వాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.