గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, ఫిబ్రవరి 2019, సోమవారం

శ్రీ కందుల వరప్రసాద్ చిత్రకవి వ్రాసిన (ఇకార} గుడికందము

జైశ్రీరామ్.
బ్రహ్మ శ్రీ పోకూరి కాశీపత్యవధాని గారి గుడుల పద్య ప్రేరణతో శ్రీ కందుల వరప్రసాద్ చిత్రకవి వ్రాసిన (ఇకార} గుడికందము 

కందము 
తిరిగి తిరిగి దివిని క్షితిని 
సిరిని కినిసి నీలిగించి చిక్కి గిరిని ని
ల్చిరి ప్రీతిని విధి బిగినీ 
విరించి కీరితి నిధి నిడి బిలిబిలి  గ్రీష్మీ! 

అర్థం :- బిలిబిలి  గ్రీష్మీ! = ముద్దు లొలుకు నవ మల్లిక, దివిని క్షితిని = దేవలోకము, భూలోకములలో, తిరిగి తిరిగి= వెదకి, నీలిగించి= తిండి లేక మాడి, సిరిని కినిసి= లక్ష్మీదేవి ని సమీపించి, చిక్కి= కదలలేక, గిరిని నిల్చిరి = కొండపై నిలచి, 
విధి బిగిని = విధి శాపముచే, 
ప్రీతిని= ఇచ్ఛ తో, విరించి= విష్ణువు, కీరితి =  యశస్సు 
నిధి నిడి = స్థానం ఇచ్చెను. 

భావము :- ముద్దు లొలుకు నవ మల్లిక,
లక్ష్మీ దేవి కొరకు దేవలోకము, భూలోకములలో వెదుకు విష్ణువు శుష్కించి , లక్ష్మీదేవిని సమీపించి తిరుమల గిరిపై నిలచి, ఆ కొండకు ఇంతటి పేరుప్రఖ్యాతులు కలుగ జేసెను.
 జైహింద్.

Print this post

2 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గుడి కందము చాలా బాగుంది.శ్రీ కందుల వరప్రసాద్ గారికి అభినందనలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కందుల వర ప్రసాద్ చెప్పారు...

గురుదేవులకు మరియు సహృదయ స్పంధనకు
అక్కయ గారికి పాదాభివందనములు 🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.