జైశ్రీరామ్
జైహింద్.
జైహింద్.
భాషాప్రవీణ.M.s.s.n.మూర్తి.ఎంఏ.తెలుగు.ఎంఏ.సంస్కృతము.శ్రీకాకుళం.అభినందనమందారంఛందోబంధువూ, కవితా సింధువూ - - - - - - -సాహితీవల్లభులు,ఒజ్జల మిన్న,ఛంద స్సింహం
(శ్రీ వల్లభ వఝల అప్పలనరసింహ మూర్తి గారు స్వచ్ఛందంగా విరచించిన ఛందశ్శాస్త్ర శిఖరాయమాణగ్రంధ రాజం "శ్రీవల్లభేయ ఛందోమధనమం"-అత్యంతప్రసశంస నీయంగా ఉంది. వారికి భక్తి పూర్వక నమోవాకములు.శ్లో:--"శిక్షా, వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తధాకల్పశ్చేతి షడంగాని వేద స్యాహు ర్మనీషిణః"-అని ఆరు వేదాంగాలు చెప్పబడ్డాయి. వాటిలోఛందశ్శాస్స్త్రం కూడ మూడవదిగా ఉంది. ఇది కూడ ఒక ప్రభావమైన వేదాంగం అన్నమాట.అది ఓ మహా సముద్రం అని భావిస్తే, దాన్ని మధించిన ఈ మూర్తి మహాశయులు, మంధర పర్వత మన్న మాట.అలా ఛందశ్శాస్త్రముమీద విస్తారమైన పరిశోధన ఎన్నోసంవత్సరాలపాటు చేసి,విశిష్టమైన ఈ కృతిని వెలయించిన వేదవేత్తశ్రీ మూర్తిగారు. ఛందశ్శాస్త్రానికే ఎనలేని మేలు చేశారు. ఈ రచనతో పోలిస్తేమనసంస్కృతాంధ్రపూర్వఛందః కర్తలు చెప్పిన,ఆయా ఛందస్సులు,వాటికిసంబంధించిన వివిధ వృత్తాలు చాలా పరిమిత మైనవి.వాటితోనే మపద్యసారస్వతం, ఎంతెంతో విరివియై విపులమై విలసిల్లి,ఆయా మహాకవీంద్రులచేతుల్లో దివ్యాతి దివ్యమైన వైభవంతో ప్రాభవంతో,వెయ్యేళ్ళుపైబడి పరిఢవిల్లింది. అలాంటిది, నేటియీ ఛాందస ప్రవణైక మతి శ్రీ మూర్తిగారి బృహత్కృషితో, ప్రభవించిన ఈకృతితో,ఛందస్సు విశ్వరూపం,విరాడ్రూపంధరించి,అవధులూ,పరిధులూ లేనిదై,అసంఖ్యాకం,అమేయం అయింది.లెక్కకుమిక్కిలిగా,ఆయాఛందస్సుల్లో,నేటికవులూ,అవధానులూ,పద్య
రచన,విశిష్టంగా,సాగించవచ్చు.. మరెన్నో మహాద్భుతాలు,సాధింపవచ్చు. మ
సారస్వతవికాశసం నవ్యాతి నవ్యమై,ఈఛందఃకృతషి,రచనతో మరింతగాకొనసాగుతుందని,శ్రీ మూర్తిగారి నిరుపమ కృతి.ఈ పుస్తకం రూపంలోఅవశ్యం జైవాతృక మవుతుందని,మనమందరం ఆశిద్దాం.నిజానికి శాస్త్ర విషయికమైన యింత అవిరామమైనకృషికీ,సాధనకూ! శ్రీమూర్తి మహోదయులకు,ఓ డాక్టరేట్ఇవ్వవచ్చు అనిపిస్తోంది.ఇది పరిశోధనేకదా! కవిత అందాలు చక్కగా ఎరిగిన శ్రీమూర్తిగారు ఆయానూతనఛందంలో విశేషాలకూ,ఆయావృత్తాలకూ కూడ చాల అందమైన అత్యంత సమంజసమైన పేర్లు కూడా పెట్టారు.ఇది అభినంద నీయం. నామకరణం చేసిన కృతిజనకుడికి ప్రణామకరణం మాత్రమే మనం చెయ్య గలిగేది!