గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

27, జనవరి 2018, శనివారం

ఆటాకి పోటీ యేది ? .. .. .. ఆటా రజతోత్సవ సంచికలో ప్రచురియమైన నా వ్యాసము.

 జైశ్రీరామ్
ఆటాకి పోటీ యేది ?
రచన. చిత్రకవిసామ్రాట్ చింతా రామకృష్ణా రావు. 919247238537. భాగ్యనగరము,
భారత దేశము,
. శుభములు కలుగుత జననికి. - శుభములగుత హరి హరులకు, శుభము తెలుఁగుకున్.
శుభమగునాటా జనులకు  నభయంబుగ దైవముండునందరిలోనన్.
అమెరికా తెలుగు సంఘం.
ఎన్నారైలు అమెరికాలో ఉన్నాగాని తెలుగు సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకొంటూ వస్తున్న తీరు పొగడఁదగినది. వారు తమ ఉద్యోగాలకు, వ్యాపారాలకు మాత్రమే పరిమితం కాకుండా జన్మభూమికి తమవంతు సేవలందచేస్తున్నారు. కళా, సాహిత్యం, సామాజికసేవా రంగాల్లో ఆటా చేస్తున్న కృషి అసామాన్యమైనది..
తే.గీ. మెరికా తెల్గు సంఘమే యాంధ్ర కీర్తి  దిక్కులన్నిట మార్మ్రోగి, తేజరిలఁగ
జేసెనందురు. నిజమదే. లేశమైన  సత్యదూరమ్ము కాదిది. స్తుత్యమిద్ది.
భావము. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజల సంఘము ఆంధ్రుల యొక్క కీర్తిని దశ దిశలను మారుమ్రోగిపోయేలాగ చేస్తోందని అందరూ చెప్పుకొంటూ ఉంటారు. ఆ మాట ముమ్మాటికీ నిజమే. ఇందు ఏమాత్రమూ అబద్ధమనునది లేదు. ఈ సంస్థ మిక్కిలి పొగడ తగినది.
. నాటి పుణ్య ఫలమో
   టీనేజు తెలుఁగు జనులు పటిష్ఠత చూపెన్.
   నాటికైన నిజమిది.
   ఏనోటను విన్న ఆటయే పొగడఁబడున్.
భావము. ఇది తెలుగువారు ఏనాడు చేసుకొనిన పుణ్యముల ఫలమో కదా! యుక్తవయస్కులు ఖండాంతరములలో కూడా తమ ప్రతిభాపాటవములను చూపుచుండిరిఏనాటికైనా సరే ఇది నిజము. ఏ నోట విన్నను అమెరికా తెలుగు సంఘం పొగడఁబడుచునే యుండును.

. ఆటా పాటల నెలవిదిఆటాడినయట్లు తెలుగులపురూపముగా
పోటీపడి ప్రతిభ ప్రతి  ష్ఠాపనమును చేయు ఘనులు. సౌమ్యత తోడన్.
ఆటా ఆటలకు పాటలకు స్థానము. ఆటా లోని తెలుగు సంఘ జనులు ఎంతో సౌమ్యతతో ప్రవర్తిస్తూ, తమ పనులను అటాడినంత సులభముగా పోటీపడుతూ చేయుటయందు నిపుణులు. ఖండాంతరములందు కూడా  తమ ప్రతిభను స్థాపించే ఘనులు.

. ఆటాలో ఆడామగనీటుగ తమ ఘనత చూపు నిరుపమ కృషితో
పోటీపడి పని చేయుచుఘాటుగ స్పందితురాత్మ గౌరవ మతులై.
ఆటా సభ్యులు ఎంతో కృషి చేస్తూ, పని చేయుటలో పోటీ పడుతూ, తమ ఘనత తెల్లమయే విధంగా ఎంతో మేలుతరముగా పని చేయుటలో నిపుణులు. తమ ఆత్మాభిమానానికి భంగం వాటిల్లుతుందంటే మాత్రం ఏసందర్భంలోనైనా ఏమాత్రం కూడా ఉపేక్ష చేయక చలా ఘాటుగా స్పందిస్తారు. వారు అంతటి ఆత్మాభిమానమును, ఆత్మ విశ్వాసమును కలవారు.

. ఆటా మహిళలు మణులేమేటిని కనబరతురన్ని మేలగు పనులన్.
మాటలనమృతము కురియుదు  రేటా మహిళోత్సవములనేకులు జితులౌ.
భావము. ఆటా సభ్యురాండ్రు తాము మంచి కొఱకే పని చేయుచు ఆ పనులలో తమ సత్తా చూపుతారు. వారు పరులతో సంభాషించునప్పుడు ఎంతో తీయగా, వినేవారికి ఆనందము కలిగించే విధంగా మాటాడుటలో నిపుణులు.. ప్రతీ సంవత్సరమూ జరుపుకొనే మఃహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొను వారిలో అనేకులు విజయములను సొంతము చేసుకొంటారు.

. ఉత్సవములలో పాల్గొని  సత్సంగము నెరపుచుంద్రు సహృదయ సభికుల్.
మత్సరభావము లెఱుఁగక  నుత్సాహము చూపుచుందు రుత్తమగుణులై.
భావము. ఆటా నిర్వహించే ఉత్సవములలో తప్పక అందరూ పాల్గొంటూ ఉంటారు. అంతమందీ మంచివారే, చక్కగా అందరూ కలుస్తారు. ఒకరిని చూచి మరొకరు మాత్సర్యమును పొందుట అనే దుర్గుణము వారిలో మచ్చుకైనా కనబడదు. అన్నింటిలోనూ తమ ఉత్సాహాన్ని ప్రదర్శించే బుద్ధిమంతిలీ ఆటా సభ్యులు.
వారి సమైక్యత ప్రశంసనీయము.
. పైదేశములోనుండియు  యీదేశప్రజల కొఱకు నెంతో చేసే
సోదరు లాటా సభికులుఆదరమును చూపు వారి నభినందింతున్.
భావము. స్వదేశమును వదలి జీవనోపాధికై విదేశములకు వెళ్ళి అక్కడ జీవించుతూ కూడా, తమ స్వదేశమును, ప్రజలను మరచిపోకుండా, తెలుగు జాతి సంక్షేమము కొఱకై ఎంతైనాసరే చేయడానికి ఉత్సాహము చూపు మహనీయులు వీరు. అట్టి ఆటా సోదరీ సోదరులను మనసారా అభినందించుచున్నాను.
అనేక ద్వివిధ కంద పద్య - గీత పద్య - గర్భ చంపక మాల.
వర గుణమేలికే. అమృత భావన సాగరమాట మాట. భా
స్కర ఘనతేజమే. తెలుఁగు జాతిని వెల్గెడు దీప్తి చూడ! దే
వర! కననౌన్గదా! సుగుణ వర్ధన సత్య సుశోభితమ్ము రా
చరమణియే కదా! మహిని చల్లని, ఆటకు మంగళంబులౌన్.
భావము. మంచి గుణము అనునది మనను నడిపించు దైవమే. ఆటా వారి మాట అమృత భావనా సాగరమే.
వారిది సూర్యునిపోలు గొప్ప తేజస్సే. వీరిని చూడగా తప్పక మన తెలుఁ జాతిని కాంతి ప్రసారితమౌతుంది. ఓ పరమాత్మా! అట్టి దీప్తి తప్పక చూడఁ గలుఁగుదుముకాదా ? మంచి గుణములచే వర్ధనమగు సత్యము మంచి ప్రకాశతమమగు రాజ కాంతయే కదా!భూమిపై సద్గుణములతో విరాజిల్లే చల్లని సంస్థ మన ఆటాకు నిత్యమూ శుభములు కలుగునుగాక.
చంపక గర్భస్థ ద్వివిధ కందము ౧.
గుణమేలికే. అమృత భా  వన సాగరమాట మాట. భాస్కర ఘనతే
కననౌన్గదా! సుగుణ వ  ర్ధన సత్య సుశోభితమ్మురాచరమణియే.
చంపక గర్భస్థ ద్వివిధ కందము ౨.
ఘనతేజమే. తెలుఁగు జా  తిని వెల్గెడు దీప్తి చూడ! దేవర! కననౌ
మణియే కదా! మహిని చ  ల్లని, ఆటకు మంగళంబులౌన్వర గుణమే.
చంపక గర్భస్థ తేటగీతి.
అమృత భావన సాగరమాట మాట  తెలుఁగు జాతిని వెల్గెడు దీప్తి చూడ!
సుగుణవర్ధన, సత్య సుశోభితమ్ము.   మహిని చల్లని ఆటకు మంగళంబు.
జైహింద్.


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
ఆటా సభల గురించి " ఆటాకి పోటీఏది " అని బహుముఖ ప్రజ్ఞాశాలి , చిత్రబంధ గర్భ కవితా సామ్రాట్ శ్రీ చింతా వారి రచన అద్భుతముగా నున్నది. " ఇక్కడ ఎడిసన్ " లో జరిగినప్పుడు నేను వెళ్ళాను. చాలా బాగుంటాయి . అద్భుతమైన విషయాలను అందించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.