జైశ్రీరామ్.
మోహక,తన్వినీ,గర్భ-సిరులొనరువృత్ తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి .
జుత్తాడ.
సిరులొనరువృత్తము.
==============.
ఉత్కృతిఛందము.న.న.జ.స.న.న.న.న.గ ల.గణములు.
యతులు10,19.అక్షరములు.ప్రాసనీమము గలదు.
జడముడిని నెలమొల్క! జగదాంబ!యరలొడలు!జలముల జలకాలు!
జడుపొనరు కడుబీద! జగమేలు!హరుడతడు! చలనము మరుభూమి!
చెడుతరుము శివమూర్తి!సెగఱేడు!నుదురొదవు!జి లుగుల వెలిమేను!
తొడవుమెడ చదిరంబు!తొగసూడు!నెల కనులు!తొలకక సిరులిచ్చు!
నెలమొల్క=చంద్రవంక,యరలొడలు=అర్ధ నారీశ్వరి,జడుపొనరు=
మిక్కిలిబాధాకరమైన,మరుభూమి=స్మశా నము,చెడుతరుము=చెడును
తొలగించు,సెగఱేడు నుదురొదవు=అగ్నిఫాలముననొప్పు,జి లుగుల
వెలి మేను=ప్రకాశించెడితెల్లనిశరీరము .తొడవుమెడ=కంఠాభరణము
,చదిరంబు=సర్పము,తొగసూడు=సూర్యు డు,నెల=చంద్రుడు,
శివమూర్తి=శాంత స్వభావుడు.
1.గర్భగత"-త్రినేత్ర"-వృత్తము.
బృహతీఛందము.న.న.జ.గణములు.వృ.సం. 384.ప్రాసగలదు.
జడముడిని నెలమొల్క!
జడుపొనరు కడుబీద!
చెడు తరుము శివమూర్తి!
తొడవు మెడ చదిరంబు!
2.గర్భగత"-సననా"-వృత్తము.
బృహతీఛందము.స.న.న.గణములు.వృ.సం. 508.ప్రాసగలదు.
జగదాంబ! యరలొడలు!
జగమేలు హరుడతడు!
సెగఱేడు నుదురమరు!
తొగసూడు నెల ,కనులు!
3.గర్భగత"-మృదుపద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.న.గల.గణములు.వృ .సం.192.ప్రాసగలదు.
జలముల జలకాలు!
చలనము మరుభూమి!
జిలుగుల వెలి మేను!
తొలకక సిరు లిచ్చు!
4.గర్భగత"- మాతాశ్రీ"-వృత్తము.
ధృతిఛందము. న.న.జ.స.న.న.గణములు.యతి10వయక్షర ము.
ప్రాసనీమముగలదు.
జడముడి నెలమొల్క!జగదాంబ!యరలొడలు!
జడుపొనరు కడు బీద! జగమేలు హరుడతడు!
చెడుతరుము శివ మూర్తి! సెగఱేడు!నుదురొదవు!
తొడవుమెడ చదిరంబు! తొగసూడు!'నెల' కనులు!
5.గర్భగత"-యరలొడలు"-వృత్తము.
అత్యష్టీఛందము.స.న.న.న.న.గల.గణము లు.యతి10వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జగదాంబ!యరలొడలు! జలముల జలకాలు!
జగమేలు!హరుడతడు! చలనము మరుభూమి!
సెగఱేడు!నుదురొదవు! జిలుగుల వెలిమేను!
తొగసూడు!'నెల"కనులు! తొలకక సిరులిచ్చు!
6.గర్భగత"-జలకాల"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.న.న.గల.గణము లు.యతి9వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జలముల జలకాలు!జడముడి నెలమొల్క!
చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!
జిలుగుల వెలిమేను! చెడు తరుము శివమూర్తి!
తొలకక సిరులిచ్చు! తొడవుమెడ చదిరంబు!
7.గర్భగత"-సారధీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.న.భ.న.న.భ.జ.న.ల ల.గణములు.
యతులు.9.18.అక్షరములు.ప్రాసనీమము గలదు.
జలముల జలకాలు! జడముడి నెలమొల్క!జగదాంబ!యరలొడలు!చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!జగమేలు హరుడతడు!
జిలుగుల వెలిమేను!చెడుతరుము శివమూర్తి!సెగఱేడు నుదురొదవు!
తొలకక సిరులిచ్చు!తొడవుమెడ చదిరంబు!తొగసూడు"నెల"కనులు!
8.గర్భగత"-మోహిత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.న.న.న.భ.న.న.గ ల.గణములు.
యతులు.10,18.అక్షరములు.ప్రాసనీమ ముగలదు.
జగదాంబ!యరలొడలు!జలముల జలకాలు!జడముడి నెల మొల్క!
జగమేలు హరుడతడు!చలనము మరుభూమి!జడుపొనరు కడుబీద!
సెగఱేడు నుదురొదవు!జిలుగుల వెలిమేను!చెడు తరుము శివమూర్తి!
తొగసూడు "నెల"కనులు!తొలకక సిరులిచ్చు!తొడవుమెడ చదిరంబు!
9.గర్భగత"-మోహక"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.న.న.న.న.జ.న.న.గ ల.గణములు.
యతులు.10,19.అక్షరములు.ప్రాసనీమ ముగలదు.
జగదాంబ!యరలొడలు!జడముడి నెల మొల్క!జలముల జలకాలు!
జగమేలు హరుడతడు!జడుపొనరు కడు బీద!చలనము మరుభూమి!
సెగఱేడు నుదురొదవు!చెడుతరుము శివమూర్తి!జిలుగుల వెలిమేను!
తొగసూడు"నెల"కనులు!తొడవుమెడ చదిరంబు!తొలకక సిరులిచ్చు!
10.గర్భగత"-తన్వినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.భ.జ.న లల.గణములు.యతి9వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జలముల జలకాలు!జగదాంబ!యరలొడలు!
చలనము మరుభూమి!జగమేలు హరుడతడు!
జిలుగుల వెలి మేను!సెగఱేడు నుదురొదవు!
తొలకక సిరులిచ్చు!తొగసూడు"నెల"కనులు!
స్వస్తి.
వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.
జైహింద్.
2 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
మధుర మైన ద్రాక్ష రసం మరియు గర్భ గతమైన పద్యాలు శ్రీమాన్ వల్లభవఝల వారికే సొంతం.. వారికి పాదాభివందనములు.
నమస్కారములు
గురుదేవుల ప్రతిభకు ప్రణామములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.