జైశ్రీరామ్.
దాతృత్వ,దోషినీ,గర్భ పురుషార్ధవృత్తము.
రచన:- వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
పురుషార్ధవృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.భ.స.య.జ.భ.స.గ గ.గణములు.
యతులు.10,19.అక్షరములు.ప్రాసనీమ ముగలదు.
ధర్మార్ధ కామమోక్షంబులు తగనొప్ప !దాతృత్వ బుద్ధి! తా నిల నడువన్మేలౌ!
మర్మంపుచర్య!చేరంజెడు!మగరాయుడీ వంచు బల్క!మానవ!పరమంబోపన్!
చర్మంపు ముక్తిగల్గంజను! జగదైక కీర్తిన్గడించు!జ్ఞానిగ చరితం నిల్వన్!
పర్మాత్ముదృష్టి శ్రేయంబగు! పగబూని!దోషాలనెట్టు! ప్రాణము!చరితంబేరా!
చర్మంబు=అశువులుబాసినతదుపరి.చరి తం=చరిత్రయందు
ప్రాణముచరితంబేరా=జీవనమశాశ్వతంబు .
1.గర్భగత"-ఆశామోహ"-వృత్తము.
బృహతీఛందము.త.ర.భ.గణములు.ప్రాస గలదు.వృ.సం.402.
ధర్మార్ధ కామమోక్షంబులు
మర్మంపు చర్య!జేరన్జెడు.!
చర్మంపుముక్తి!గల్గం జను!
పర్మాత్ము దృష్టి! శ్రేయంబగు
2. గర్భగత"-వశిత"-వృత్తము.
బృహతీఛందము.స.య.జ.గణములు.ప్రాస గలదు.వృ.సం.332.
తగనొప్ప!దాతృత్వ బుద్ధి!
మగరాయుడీవంచు బల్క!
జగదైక !కీర్తిన్గడించు
పగబూని! దోషాల నెట్టు!
3.గర్భగత"-శ్రీనామ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.స.గగ.గణములు. ప్రాసగలదు.వృ.సం. 31.
తానిల నడువన్మేలౌ!
మానవ! పరమంబోపన్?
జ్ఞానిగ!చరితం!నిల్వన్!
ప్రాణము!చరితంబేరా!
4.గర్భగత'-తగుతగ"-వృత్తము.
ధృతిఛందము.త.ర.భ.స.య.జ.గణములు. ప్రాసగలదు
.10.వ.అక్షరముయతి.
ధర్మార్ధ కామమోక్షంబులు!తగనొప్ప!దాతృత్వ! బుద్ధి!
మర్మంపు!చర్య చేరంజెడు!మగరాయుడీవంచు బల్క!
చర్మంబు!ముక్తి కల్గన్జను!జగదైక!కీర్తింగడించు!
పర్మాత్ము దృష్టి శ్రేయంబగు!పగబూని!దోషాల!నెట్టు!
5.గర్భగత"-మాయజీవన"-వృత్తము.
అత్యష్టీఛందము.స.య.జ.భ.స.గగ. గణములు.ప్రాసగలదు.
10.వ.అక్షరముయతి.
తగనొప్ప!దాతృత్వబుద్ధి తానిల నడువన్మేలౌ!
మగరాయుడీవంచు!బల్క!మానవ!పరమంబోప న్!
జగదైక!కీర్తిన్గడించు! జ్ఞానిగ! చరితన్నిల్వన్
పగబూని!దోషాల!నెట్టు!ప్రాణము చరితంబేరా!
6.గర్భగత"-పరమోపు"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.మ.ర.య.లల. గణములు. ప్రాసగలదు.
9.వ.అక్షరముయతి.
తానిల నడువన్మేలౌ!ధర్మార్ధ కామమోక్షంబులు!
మానవ! పరమంబోపం!మర్మంపుచర్య!చేరంజెడు!
జ్ఞానిగ!చరితన్నిలువన్! చర్మంబుముక్తి!కల్గం జను!
ప్రాణము!చరితంబేరా! పర్మాత్ము!దృష్టి శ్రేయంబగు!
7.గర్భగత"-మేలగు."-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.మ.ర.య.న.జ.త.గ ల.గణములు.
ప్రాసగలదు. యతులు,9.18.అక్షరములు.
తానిల!నడువన్మేలౌ!ధరర్మార్ధకామ మోక్షంబులు!తగనొప్ప !దాతృత్వబుద్ధి!
మానవ!పరమంబోపం!మర్మంపుచర్య!చేరం జెడు!మగరాయుడీవంచు!బల్క!
జ్ఞానిగ!చరితన్నిలువం!చర్మంబుము క్తి!కల్గన్జను!జగదైక!కీర్తిన్గ డించు!
ప్రాణము!చరితంబేరా!పర్మాత్ముదృ ష్టి!శ్రేయంబగు!పగబూని!దోషాల!నె ట్టు!
8.గర్భగత"-తానిలా"-వృత్తము.
ధృతిఛందమ.స.య.జ.త.ర.భ.గణములు.ప్ రాసగలదు.
10.వ.అక్షరముయతి.
తగనొప్ప!దాతృత్వబుద్ధి!ధర్మార్ధ కామమోక్షంబులు!
మగరాయుడీవంచు!బల్క!మర్మంపుచర్ యజేరం!చెడు!
జగదైక!కీర్తిన్గడించు!చర్మంముక్ తి!గల్గంజను!
పగబూని!దోషాల నెట్టు!పర్మాత్ముదృష్ట!శ్రేయం బగు!
9.గర్భగత"-దాతృత్వ"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.జ.త.ర.భ.భ.సగగ .గణములు.
ప్రాసగలదు.యతులు.10.19.అక్షరము లు.
తగనొప్ప!దాతృత్వబుద్ధి!ధర్మార్ధ కామమోక్షంబులు!తానిల!నడువన్మేలౌ !మగరాయుడీవంచు!బల్క!మర్మంపుచర్ య!జేరన్జెడు!మానవ!పరమంబౌనే
జగదైక!కీర్తిన్గడించు!చర్మం ముక్తిగల్గన్జను!జ్ఞానిగ! చరితన్నిల్వన్!
పగబూని!దోషాల నెట్టు!పర్మాత్ముదృష్టి!శ్రేయంబ గు! ప్రాణము!చరితంబేరా!
10.గర్భగత"దోషషినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.ర.భ.భ.స.త.జ.త.గ ల.గణములు.
ప్రాసగలదు.యతులు.10.18.అక్షరము లు.
ధర్మార్ధకామమోక్షంబులు .తానిలనడువన్మేలౌ!తగనొప్పదాతృత్ వ!బుద్ధి!
మర్మంపుచర్య!జేరంజెడు!మానవ!పరమం బోపన్!మగరాయుడీవంచు!బల్క
చర్మం!ముక్తి!గల్గంజను!జ్ఞానిగ! జరితన్నిల్వన్!జగదైక!కీర్తిన్ గడించు!
పర్మాత్ముదృష్టి!శ్రేయంబగు!ప్రా ణము!చరితంబేరా!పగబూని!దోషాల!నె ట్టు!
ఇట్లు
వల్లభవఝల.
బ్రహ్మశ్రీ వల్లభవఝల కవి వరులకభినందన పూర్వజ వందనములు.
జైహింద్.
1 comments:
ప్రణామములు
గురువులకు అభినందన మందారములు. అద్భుత మైన సాహిత్యమును అందిస్తున్న శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.