శ్రీరస్తు.
(ప్రథమ) పద్య పక్షమ్.
కార్మిక సంక్షేమమ్.
రచన. చింతా రామకృష్ణారావు.
శా. శ్రీలన్ దేల్చ మనోజ్ఞ భారతిని సచ్చీలంబుతోఁ
గార్మికుం
డాలోచించి, దురంత కర్మగతి మోహాదుల్ విసర్జించి,
తా
నేలున్ యంత్ర కబంద రాక్షసుల, మోహించున్ ప్రమాదంబులన్.
చాలం గల్గెడివారు లేరు
తనతోన్ సద్భాష్యమై యొప్పుటన్. 1.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
కార్మిక జనపాళి కష్టంబు
మరిపించి - గౌరవమును
గొల్పు కార్యములను
చేయునటులఁ జేసి చేయూత
నీయుమా -
నమ్మి కొలుతు నిన్ననంత
కృష్ణ.
తగిన వసతి, భుక్తి, ప్రగణిత వైద్యము, - చదువు నేర్ప బడులు సముచితముగ
వారి వారికొఱకు వర్ధిల్ల
కల్పించు - భక్తిగ నినుఁ గొల్తు భవ్య కృష్ణ.
ఆ.వె. కష్ట
జీవులకును కర్మ వీరులకును - కామితములు తీర్చి కరుణఁ జూపు.
పద్య సద్రచనను పటువర్ధనము
చేయు -
పద్య పక్ష మధుర భావ
కృష్ణ. 2.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
నీరజాక్ష!
యతని భారము కనవేల -
నిత్య సంతసమును నిలుప వేల?
యతని
జీవితమున వెతలు బాపినఁ జాలు. -
పద్య పక్షమటుల వరలుఁ గృష్ణ!
జీవితాన
సుఖము, భావిపై నాశయు, - కలుగునటులఁ జేసి
కనఁగ లేవ?
భావి
లేని యతని జీవితమ్మది యెట్లు -
వరలునయ్య? కనుమ వరలఁ గృష్ణ.
ఆ.వె.
బంధు హితుల తోడఁ
బకపక
నవ్వుచు - పండుగలను వెలుఁగ నిండు మదిని
చేయువాఁడవనుచు
చేయంగ కోరుదు - నిష్టఁ గొలిచి నిన్
బ్రకృష్ట కృష్ణ!
! 3.
ఆటవెలదిత్రయ గర్భసీసము.
పద్య పక్షమునను ప్రబలెడి శ్రీకృష్ణ! - కార్మికులకు నీవు కావె రక్ష?
వారి జీవితమును వర్ధిల్లఁ జేయుమా! - భక్త సులభ దివ్య భాగ్య కృష్ణ!
యంత్రరాక్షసులను మంత్ర
ముగ్ధులఁ జేసి - నేర్పు మీర ప్రగతి నిత్యమొసఁగు
సాధనమున దేశ సంపద పెంతురా
-
కార్మికులను నీవె కలవు
కృష్ణ!
ఆ.వె. కార్మికులను
కాచు ఘనులు కర్మాగార - ప్రభువులందు నిలిచి వరలు కృష్ణ!
కార్మికులను బ్రేమఁ
గనఁ జేయుమా! వారి - గౌరవమును నిల్పి కాచు కృష్ణ!
4.
బహు ద్వివిధ కంద గీత
గర్భ చంపకమాల.
ధర క్షమ వేల్పులై, శ్రమను ధర్మము చేయుచు క్రాలుచుంద్రు
ప్రా
గ్వర సుమతుల్ లసత్ క్షమజ
వర్గము కార్మిక శక్తి వీవెగా!
వర ప్రముదాస్పదా! వసుధ పై శ్రమఁ గాంచుము.
పద్య పక్ష స
ద్భర విమలాత్మలన్
యతుల ధైర్యము నీవ యనంత
కృష్ణయా! 5.
స్వస్తి.
జైహింద్.
1 comments:
నమస్కారములు
పద్యము లన్నియు శ్రీ అనంత కృష్ణ గారిస్తుతితో అలరించు చున్నవి శ్రీ చింతా సోదరులకు అభినందమలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.