జైశ్రీరామ్.
జీవావసాన,తాజీరస,గర్భరంగస్థలీవృ త్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.
జుత్తాడ.
రంగస్థలీవృత్తము.
+++++++++++
ఉత్కృతిఛందము.భ.త.న.త.జ.త.జ.ర. స.మ.గల.గణములు.
యతులు10,19.అక్షరములు.ప్రాసనీ మముగలదు.
జీవన రంగస్థలమున!జీరెం తుది ఘట్టమంచు!చింతిలనేలా?బేలా!మదిన్ !
పావకమౌ పాత్రకుదుర!పారెన్సమయంబటంచు!పం తుకుపోనేలా?నరా!
భావము,భష్యంబులలర!పారంబగునట్టి చర్య!భ్రాంతులదేలన్తప్పౌగదే?
శ్రీవరమేర్చున్గనుమయ!చేరున్పరమా ర్ధమౌచు!చెంతన్నిల్చుం!దైవంబి లన్!
1.గర్భగత"-నుతభంగ"-వృత్తము.
బృహతీఛందము.భ.త.న.గణములు.వృ.సం. 487.ప్రాసగలదు.
జీవన రంగస్థలమున!
పావకమౌ!పాత్ర కుదుర!
భావము!భాష్యంబులలర!
శ్రీపరమేర్చున్గనుమయ!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు. వృ.సం.173.ప్రాసగలదు.
జీరెన్తుది ఘట్టమంచు!
పారెన్సమయంబటంచు!
పారంబగునట్టి !చర్య!
చేరున్పరమార్ధమౌచు!
3.గర్భగత"-దోషాచరా"-వృత్తము.
బృహతీఛందము.భ.మ.ర.గణములు.వృ.సం. 135.ప్రాసగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!
పంతుకు!పోనేలా?నరా!.
భ్రాంతులదేలందప్పౌ?గదే!
చెంతనునిల్చుం!దైవంబిలన్!
4.గర్భగత"-నతకీర్తి"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.త.న.త.జ.గల. గణములు.యతి.10యవఅక్షరము.
ప్రాసనీమముగలదు.
జీవన రంగస్థలంబున!జీరున్తుది ఘట్టమంచు!
పావకమౌ పాత్రకుదుర!పారెన్సమయంబటంచు!
భావము!భాష్యంబులలర!పాంబగునట్టి చర్య!
శ్శ్రీవరమేర్చున్గనుమయ!చేరున్ పరమార్ధమౌచు!
5.గర్భగత"-బేలా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.మ.లగ. గణములు.యతి09.వయయక్షరము.
ప్రాసనీమముగలదు.
జీరెన్తుది ఘట్టమంచు!చింతిల నేలా?మదిన్!
పారెన్సమయంబటంచు!పంతుకు పోనేలానరా!
పారంబగునట్టి!చర్య! భ్రాంతుల! దేలంతప్పౌ!గదే!
చేరున్పరమార్ధమౌచు! చెంతను!నిల్చుం!దైవంబిలన్!
6.గర్భగత"-భ్రమరక"-వృత్తము.
ధృతిఛందము.భ.మ.ర.భ.త.న.గణములు. యతి10వయక్షరము.
ప్రాసనీమముగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!జీవనరం గస్థలమున!
పంతుకు పోనేలా?నరా!పావకమౌ!పాత్రకుదుర!
భ్రాంతుల దేలన్తప్పౌగదే!భావము!భాష్యంబు లలర!
చెంతను నిల్చున్!దైవంబిలన్! శ్రీవరమేర్చన్గనుమయ!
7.గర్భగత"-రతనతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.మ.ర.భ.త.న.త.జ. గల.గణములు.
యతులు.10,19,అక్షరములు.ప్రాసనీ మముగలదు.
చింతిలనేలా?బేలా!మదిన్!జీవన రంగస్థలమున!జీరెన్తుది ఘట్టమంచు!
పంతుకుపోనేలా?నరా!పావకమౌ!పాత్ రకుదుర!పారెన్సమయంబటంచు!భ్రాంతు లదేలంతప్పౌ!!భావము,భాష్యంబులలర! పారంబగునట్టిచర్య!
చెంతను!నిల్చున్దైవంబిలన్!శ్రీ వరమేర్చన్గనుమయ! చేరున్పరమార్ధ!మౌచు!
8.గర్భగత"-యశజలా"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.మ.య.స.జ. లలంగణములు.
యతులు.09.18.అక్షరములు.ప్రాసనీ మముగలదు
జేరరెన్తుదిఘట్టమంచు!చింతిలనేలా ?బేలా!మదిం!జీవన!రంగస్థలమున!పా రెన్సమయంబటంచు!పంతుకు!పోనేలా? నరా!పావకమౌపాత్రకుదుర!
పారంబగునట్టిచర్య!భ్రాంతులదేలం దప్పౌగదే!భావము,భాష్యంబులలర!
చేరున్పరమార్ధమౌచు!చెంతను!నిల్ చున్దైవంబిలన్!శ్రీవరమేర్చంగను మయ!
9.గర్భగత"-జీవావసాన"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.స.భ.లల. గణములు.యతి09.వయక్షరము.
ప్రాసనీమముగలదు.
జీరెంతుదిఘట్టమంచు!జీవన రంగస్థలమున!
పారెం!సమయంబటంచు!పావకమౌ!పాత్రకు దుర!
పారంబగునట్టిచర్య!భావము!భాష్యం బులలర!
చేరంపరమార్ధమౌచు!శ్రీవరమేర్చం గనుమయ!
10.గర్భగత"-తాజీరస"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.స.భ.స.స.మ. లగ.గణములు.
యతులు.09.18.అక్షరములు.ప్రాసనీ మముగలదు.
జీరెంతుదిఘట్టమంచు!జీవనరంగస్ థలమున!చింతిలనేలా?బేలామదిన్!
పారెంసమయంబటంచు!పావకమౌ!పాత్రకు దుర!పంతుకు!పోనేలా?నరా!
పారంబగునట్టిచర్య!భావము భాష్యంబులలర!రాంతుల!దేలం!దప్పౌ!
చేరంపరమార్ధమౌచు !శ్రీపరమేర్చం!గనుమయ!చెంతను!ని ల్చన్దైవంబిలన్!
స్వస్తి..
మూర్తి. జుత్తాడ.
జైహింద్.
3 comments:
dear sir very good blog and very good content
Latest Telugu News
dear sir very good blog and very good content
Latest Telugu News
పండితోత్తములకు ప్రణామములు
నా ఈ చిన్నకలం సరిపోదు . ఎన్నొ తెలియని ఛందస్సులు ఎన్నెన్నో తెలియని వృత్తములు చాలా బాగుంది . ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.