జై
శ్రీరామ్.
5వ పద్య పక్షమ్. సర్కారు బళ్ళు చదువుల గుళ్ళు.
రచన. చింతా రామ కృష్ణా రావు.
ఆటవెలది త్రయ గర్భ సీసము.
శ్రీకరంబు చదువు, చిత్జ్ఞాన సుఫలద. జీవితేశునఱయఁ జేయునిదియె.
జీవ శక్తినొసఁగు జీవికకిదిప్రాపు,
భావి భాగ్యమిదియె, దేవ! కృష్ణ!
చదువు సంద్యలరయ, సన్మార్గమరయంగ, గురుకులంబులమరఁ గొలుప నాడు
నేడు బ్రతుకు బాట నేర్పాటు
సర్కారు బడులు చేయు నవియె గుడులు కృష్ణ!
ఆ.వె. గుడులలోన
శిలను కూర్మిని గను దైవ
మనుచు నేర్పు బడులు
మనకు గుడులు.
సత్యమెన్నిచూడ సర్కారు
బడి మేలు
కొలుపు, మదిని మేలుకొలుపు కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఓనమాలనరయ నోర్పుతో సర్కారు
బడులు నేర్పి కొలుపు భక్తి మనకు
ఆంగ్లవర్ణములనె యరయమంచును
నేర్పు నట్టివేల విను మహాత్మ కృష్ణ!
పెక్క సొమ్ములొసఁగి
పేరున్న బడులంచు నాంగ్ల భాషనరయనంప శిశువు
చిక్కులందుపడుచు చీకాకు
పొందునే? క్షేమమేల
కలుగు శ్రీశ! కృష్ణ!
అ.వె. భాగ్యమంతపోవు,
భవిత శూన్యంబగు,
తెలుఁగు భాష మరచు, నలిగిపోవు
నెట్టి కష్ట మనున దిలఁ
గన సర్కారు
బడుల నుండదు కద! ప్రనుత కృష్ణ!
ఆటవెలది త్రయ గర్భ సీసము.
ఆటపాటలకును, మేటి విద్యలకును సాటిలేని
ప్రగతి బాట నడుపు
సద్విభాసితమగు సర్కారు
బడి సాటి లేదు చూడ భువిని లేదు కృష్ణ!
నిరుపమానులయిన నిష్ణాత
బోధకుల్ నేర్పు విద్యలిచట నేర్పు మీర.
అటకు నిటకుపోయి ఆయాస
పడనేల భావి జీవితమున వరల కృష్ణ!
ఆ.వె. అమ్మపాల
సాటి యవనిని లేదుగా!
కమ్మ తెలుగు సాటి కనఁగ
లేదు.
సదయ బోధనమున సర్కారు
బడి సాటి
లేదు లేదు లేదు లేదు
కృష్ణ!
చం. చదువుల దేవళమ్ములని సన్నుతి
చేయుచు తల్లిదండ్రులిం
పొదవగ చేర్చు బిడ్డల
మహోన్నతి కోరుచు పాఠశాలలన్.
మదులఁ దలంచి బోధకులు
మాన్యతనొప్పుచు బోధఁ జేయమిన్
వదలఁడు దైవమెన్నఁడును, వారిని శిక్షలఁ గుంజునిద్ధరన్.
కం. మన్ననఁ బొందెడి బోధన,
సన్నుత సత్ప్రాంగణంబు, సద్బోధకులున్,
జెన్నుగ నుండిన మనలకు
సన్నుత సర్కారు బళ్ళు
చదువుల గుళ్ళౌన్.
జైహింద్.
1 comments:
నమస్కారములు
నేటి చదువులు .బడులు , గుడులు ,కల్తీ ప్రపంచంలో ఎలా ఉన్నాయో చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.