జైశ్రీరామ్.
ఆర్యులారా!
కవి కోట శర్మ కృత నాగపాశ బంధ చంపకమాలను ఎలా వ్రాసారో చూడండి. అభినందించండి.
నాగపాశబంధము
అంత్యప్రాసాలంకార చంపకమాల
పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్
నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్
కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్
తలచెద నీదు తత్త్వమును తత్త్వము నేనగుచున్ తరించగన్
స్వస్తి.
కోట శర్మ
కవికి అభినందనలు.
జైహింద్.
2 comments:
గురుదేవులకు వినమ్రవందనములు,
శ్రీ కోట శర్మ గారి వైవిధ్యమైన నాగపాశ బంధము అత్యద్భుతముగానున్నది వారికి అభినందన వందనములు.
నమస్కారములు
శ్రీ కోట శర్మ గారి నాగ పాశ బంధ అంత్యప్రాసాలంకార చంపకమాలా వృత్తము రమణీయముగా నున్నది. అభినందనలు . శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.