గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, డిసెంబర్ 2017, శుక్రవారం

పూర్ణిమాయామ్ అమాయాచ .. .. .. మేలిమి బంగారం మన సంస్కృతి,

జైశ్రీరామ్.
శ్లో. పూర్ణిమాయామ్ అమాయాచ ద్వాదశే రవిసంక్రమే
తైలాభ్యంగంచ కృత్వాచ, మధ్యాహ్నే నిశి సంధ్యయోః, 
అశౌచే శుచి కాలే యే, రాత్రివా సోన్వితా నరాః
శా. తులసీం యో విచిన్వంతి తే ఛిందంతి హరేః శిరః.
(దేవీభాగవతము - నారాయణ నారద సంవాదమున  ౪౯ - ౫౦ శ్లోకములు)
శా. మేలైనట్టి పవిత్రమైన తులసిన్ తృంచన్, మహత్ పూర్ణిమన్,
వాలన్ జీకటి నొప్పుచుండెడి యమావాశ్యన్, సుసంక్రాంతులన్,
తైలాభ్యంగనవేళ, ద్వాదశిని, మధ్యాహ్మంబు, సంధ్యన్, నిశిన్,
శ్రీలన్బాపెడి యాయశౌచమపుడున్, శ్రీవిష్ణు హన్యంబగున్.
భావము. పూర్ణిమ అమావాశ్య, ద్వదశి, రవి సంక్రమణము, నూని రాచుకొనిన వేళ, మధ్యాహ్న సమయమున, రాత్రి, సంధ్యలో,ైల వేళ, అశుచివేళ, ఎవరు తులసిని గిల్లునో వారు విష్నూవు యొక్క శిరమును ఛేదించినవాఁడగును.
జైహింద్.
Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
తెలియని విషయములను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.