గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, డిసెంబర్ 2017, శుక్రవారం

కవి - 2 .. .. .. కవిశ్రీ సత్తిబాబు

జైశ్రీరామ్
కవులు-తెగలు
కవన వ్యాపారము కవులందఱకును సమానమే యైనను
కావ్య కళలో వారు చేయు కృషి ని బట్టి యు, సంస్కారమును బట్టియు , తరతమ భావములు గలవు.
చెదురు పద్యములు వారు లెక్కకు మించి యుందురు.
శతకములు, ఖండకావ్యములు వంటివి వ్రాయువారు నూర్గురుండిన మహాప్రబంధ రచయితలు ఒకరిద్దఱు మాత్రమే యుందురు.
కవులు ఐదు వర్గములు :
1.వ వర్గము :- ఈ వర్గములో రచనా విధానమును బట్టి సాహిత్య మీమాంస కారుడు కవులను ఇట్లు వర్గీకరించెను. ౧) సత్కవి ౨) విదగ్దకవి ౩) అరోచకి కవి ౪) సతృణాభ్యవహారిక కవి .
౧) సత్కవి:- వీణా నాదము వలె శ్రవణా నందకరమగు వైధర్భిరీతి నాశ్రయించి కవిత్వము చెప్పెడివారు.
ఉదా: వాల్మీకి, కాళిదాసాదులు.
౨) విదగ్దకవి :- వక్రోక్తి ప్రధానమైన కవితా రచనము కావించువాడు.
ఉదా: వ్యాస, బాణాదులు విదగ్దకవులు
౩) అరోచకి కవి :- అలంకారముల మీద ఎక్కువ మక్కువ చూపుచు అర్ధగాంభీర్యము వెలయు కవిత్వము జెప్పువాడు.
ఉదా: మాఘ, భారవి, శ్రీహర్షాదులు.
౪) సతృణాభ్యవహారిక కవి:- శబ్ద ప్రధానములైనయమకానుప్రాసాదులు, చిత్రబంధాదులు గలుగు కవిత్వము వ్రాయువాడు.
ఉదా: శివభద్ర, నీతివర్మ మొదలగువారు.
స్వస్తి.
కవిశ్రీ సత్తిబాబు.
శ్రీ సత్తిబాబు గారికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవులను గురించి చక్కని సందేశము నందించిన శ్రీ కవిశ్రీ సత్తిబాబు గారికి అభినందనలు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.