గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

1, డిసెంబర్ 2017, శుక్రవారం

శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ఓంకార బంధ కందము

జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీ హరి వీయస్సెన్ మూర్తి కవి కృత ఓంకార బంధ కందముయొక్క అందమును గ్రహించండి.
ఓంకార బంధ కందము.
ఓంకార బంధము – 2
కందము
(ఆధారము – శ్రీ వల్లభ వఝల వారి గ్రంథము)
పనులను లోకహితంబున
కొనరించుచు ఘన యశంబు లొందెడి వానిన్
ధనముల్ చేరును నిత్యము
మన గల్గును వాడటన్న మరియాద యగున్.
స్వస్తి.
హరి వీయస్సెన్ మూర్తి.
కవికి అభినందనలు.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వీయస్సెన్ మూర్తిగారి ఓంకార బంధ కందము అద్భుతముగా నున్నది వారి కృషి శ్లాఘనీయము .అభినందనలు అందించిన శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.