జైశ్రీరామ్.
శ్లో. సాధుసజ్జనసాంగత్యంసంతోషం సత్ప్రవర్తనం,
సద్బుద్ధిం సద్విచారాంశ్ఛ
దేహి మే మధుసూదన !
తే.గీ. సాధు సజ్జన సంగతి సతతమిమ్ము.
సత్ప్రవృత్తి సంతోష సంచయములిమ్ము.
సద్విచారము సద్బుద్ధి సరిగనిమ్ము.
నాకునొసగుము దైవమా! శ్రీకరముగ.
భావము. ఓ మధుసూదనా! నాకు సాధుస్వభావముండేవారితోను, మంచి ప్రవర్తన గలవారితోను సాంగత్యమును కలుగజేయుము. నిరతము సంతోషముతో మంచి ప్రవర్తనతో ఉండునట్లు చేయ్ము. మంచి బుద్ధిని మంచి ఆలోచనలను నాకు ప్రసాదించుము.
జైహింద్.
4 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
మంచి ప్రార్ధన మేలిమి బంగారం మీ పద్యం .. ధన్యవాదాలు
చాలా బాగుంది గురువు గారు ...
__/\__ ...
నమస్కారములు
మేలిమి బంగారమునకు [చిరంజీవి సోదరునకు ] ఢన్య వాదములు
dhanya vaadamulu [kshamimchaali TaipaaTu ]
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.