గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, డిసెంబర్ 2017, మంగళవారం

అనురాగమూర్తులైన మీ అందరి అభినందనల, ఆశీస్సుల ఫల ప్రకాశము.

జైశ్రీరామ్.
ఆర్యులారా! కైమోడ్పులు.
 మాగురుదేవుల,  మాతాపితరుల ఆశీర్వాదఫల ప్రకాశము.
మ. మహిమోమోపేతుల పాద ధూళి పడెనో, మాన్యుల్ ననుం గాంచిరో.
సహవాసుల్ మనసార నా హితములన్ సత్కారముల్ కోరిరో,
కుహనా సంస్కృతి లేదు వీనికని నన్ గుర్తించిరో మీరు. నే
గ్రహియింపన్ దగనయ్య. మీదు మహిమన్ గావింతు మీ కంజలుల్.
చ. ఘనముగ నన్నుఁ గూర్చి వర కామితమున్ ఘనుడైన యా సురే
షు ననుగనుంగొనెన్. పిలిచె సూనృత వాక్పరి భాషణంబునన్
వినెను మదీయమౌ చరిత. విశ్వసనీయత తోచెనేమొ తా
ననుపమ రీతి వ్రాసె నిట నన్ను వచించుచు. ధన్యుఁ జేయగన్.
నాలోని శక్తి యుక్తులకు మూలమైన మీ అందరికీ నా కృతజ్ఞతాపూర్వక
వందనములు.

ఎటువంటి పరిచయము లేకపోయినను, నన్ను గుర్తించిన ఈనాడు పత్రికా విలేఖరి చిరంజీవి సురేష్ కు, 

నన్నుగూర్చి విలేఖరికి తెలిపిన ప్రేమామృత మూర్తులకు నా ధన్యవాదములు.

జైహింద్.
Print this post

9 comments:

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

గన్నవరపు నరసింహమూర్తి.
నమస్సులు శ్రీ రామకృష్ణారావుగారూ ! మీ సాహితీకృషికి చక్కని గుర్తింపు. హృదయపూర్వకాభినందనలు. ఇట్లు మీ గన్నవరపు నరసింహమూర్తి.


మీపద్యోపహారమునుకు ధన్యవాదములు దక్క మరేమి యీయగలాడను?
సర్వత్ర విజయోస్తు! ఇట్లు మీ Satyanarayana Choppakatla


అభినందనలు గురువర్యా! మీ కవిశ్రీ సత్తిబాబు

Chinta Rama Krishna Rao స్వామీ! ధన్యవాదములు.


Narayanabhatla Chaitanya అందుకోండి ఇవేమా అభినందనచందనాలు.
Chinta Rama Krishna Rao
వేదోక్తామృత సత్యవాక్ప్రతిభ! సద్విజ్ఞాన సంపన్న! స
ద్బోధోదంచిత చందనంబులవి. సత్పూజ్యా! మహద్భాగ్యమై
శ్రీదంబై ననుచెందె. ధన్యుఁడనయా! శ్రీభూసురోద్భాసితా!
మోదంబున్ ప్రణుతుల్ గొనుండు విలసత్ శ్రీమూర్తి ప్రసాదోద్భాసితా!

Chandrashekhar Acharyulu Mummadi అభినందనలు గురువుగారు.

Chinta Rama Krishna Rao చంద్రశేఖర శుభనామ! ఞాన ధామ!

సుందరంబగు మీ మదిమందిరమున,గౌరవంబున ననుఁ గాంచి ఘనతపెంచి

ప్రేమ చూపిరి. నేను సంఒరీతునయితి.

Chandrashekhar Acharyulu Mummadi నమస్తే సర్.

Annapareddy Satyanarayana Reddy గురువర్యులకు అభినందన వందనములు.
Chinta Rama Krishna Rao శుభమస్తు. ధన్యవాదములండి.

Muddu Rajaiah Avadhani అభినందనలు
Chinta Rama Krishna Rao
ముద్దు రాజయ్య! సద్గుణ పూజ్యవర్య!
శ్రీలు వర్షింపనభివంద నాళి నాకు
తెలిపి సంతృప్తుఁ జేసిరి ధీవరేణ్య!
ప్రణతులర్పింతుఁ గొనుఁడయ్య! ప్రణవ ధుర్య!

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

భాగవత గణనాధ్యాయి
భాగవత గణనాధ్యాయి నమస్కారం అండి మహాకవి శ్రీ Chinta Rama Krishna Rao గారు. మీ సాహితీ కృషికి చక్కటి గుర్తింపు. చాలా సంతోషం.... హృదయపూర్వక అభినందనలు..... అండి


Chinta Rama Krishna Rao
గణనాధ్యాయీ! ప్రణుతులు.
గుణగణ్య వరేణ్య! నన్ను గొప్పగ తలచే
ఘనులగు మీ యభినందన
నను నడుపుత! భక్తివైపు. నయ మార్గమునన్.

Elchuri Muralidhara Rao
నమస్కారములండీ. మీ ప్రతిభకు, ప్రతిభానతకు తగిన గుర్తింపు ఇది. చదివి చాలా సంతోషమైంది. మీకు హృదయపూర్వకమైన అభినందన !!
Chinta Rama Krishna Rao
లీలగ నేలుచూరి మురళీధరు లేల సమర్థులార్యులన్,
శ్రీలలితాకటాక్ష వర సిద్ధులు కావున, సత్య సంధతన్.
లాలిత సత్పదాంచిత ఫలప్రదమౌ యభినందనాళికేన్
ఫాలము వంచి మ్రొక్కెద నపార కృపాబ్ధి గొనంగ సత్ కృపన్.
ధన్యవాదములతో రామకృష్ణారావు..

Thopella Bala Subrahmanya Sarma నమఃపూర్వకాభినందనములు చింతా రామకృష్ణారావు గారూ!

Bhaskara Ramam G. మీది సహజమయిన వెలుగు అభినందనలు

Satyanarayana Choppakatla అవధాన నిర్వహణలో ఆశుకవితలో అసమానవైదుష్యం శ్రీ రామకృష్ణారావుగారిసొత్తు. వినయభూషణులు. అట్టి వీరిప్రతిభకిది చక్కనిగుర్తింపు. వీరిసుగుణములను చదవి మిగులసంతసించితిని.రావుగారికి హృదయపూర్వకమైన అభినందనలు!!

Elchuri Muralidhara Rao చక్కగా శ్రీ రామకృష్ణారావు గారి సాహిత్యవరివస్యను, సౌజన్యాన్ని, సహృదయతను సమీక్షించారు. తెలుగు సాహిత్యం వారి నిత్యకృషిచే ఇంకా ఎంతో సుసంపన్నం కావలసి ఉన్నది.

Satyanarayana Choppakatla తత్ తధాస్తు!( అది యట్లేయగుత!)

Chinta Rama Krishna Rao
శ్రీయుత చొప్పకట్ల కులశేఖర! పండిత వర్య! సత్యనా
రాయణ! ధీనిధీ! కవివరా! మీ కరుణా కటాక్షముల్
శ్రేయముఁ గూర్చుటన్ గలిగె చిత్త శుచిత్వము. తత్ఫలంబిదే.
శ్రేయము కోరు మీకునొనరింతు నమస్కృతులార్య! కొండయా!
మీకు నా ధన్యవాదములండి.

Chinta Rama Krishna Rao Elchuri Muralidhara Rao గారికి ధన్యవాదములు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Apaji Peri ॐ। "भोः, रामकृष्ण महोदय! नमोनमः।।। भवत्साहित्यर्चनं अस्मादृशां स्फूर्तिदायकं नितरां भवति!!!"नमांसि ।।।
Chinta Rama Krishna Rao
నమస్తే అప్పాజీ గారూ ధన్యవాదములం!

Sannayya Patrudu Makena అవిశ్రాంతసాహితీవేత్తకుమావినమ్రనమస్సుమాంజలులు.
Chinta Rama Krishna Rao ధన్యవాదాలండి సన్నయ్యపాత్రుఁడుగారూ!

Satyanarayana Piska
హృదయపూర్వకాభినందనలు ఆర్యా!
Chinta Rama Krishna Rao
సత్యనారాయణార్యా! ధన్యవాదములండి.

Giri Lanka సుహృదాభివందనములు గురువుగారూ
Chinta Rama Krishna Rao చిరంజీవీ! సుఖీభవ. ధన్యవాదములు నాయనా.

Suryanarayana Rao Ponnekanty సోదరుల కవితావిజయమును గూర్చి ఎంత వ్రాసినా అది తక్కువే.
Chinta Rama Krishna Rao
అన్నగారికి ధన్యవాదములు.

Ramana Balantrapu
అభినందనలు చింతావారూ. మీకింకా కడు కీర్తిప్రతిష్టలు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
Chinta Rama Krishna Rao
ఆర్యా! మీ సహృదయతకు ధన్యవాదాలండి.

Hari Vsn Murthy ఆర్యా!
అభివాదములు.
Chinta Rama Krishna Rao ధన్యవాదములండి.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sri Raghava Kiran Mukku
సుధఁ ద్రావినట్లయె నిల బ
హుధా ప్రశంసార్హమైన యున్నతమౌ మీ
దు ధవళయశస్సుపై ని
వ్విధమునఁ గథనమునుఁ జదువఁ బెదనాన్నారూ.

Chinta Rama Krishna Rao
చిరంజీవీ! రాఘవా! ఆశీస్సులు.
సుగుణ పరిపూరులైన మాసోదరులకు
పుత్ర రత్నంబువైతివా పూజ్య గుణము
లమరియున్నట్టి నిన్ను నేనభినుతింతు
సోదరులనెన్ని నీలోన. శుభము గనుము.

Rajendhar Ganapuram అభినందనలు సర్.
Chinta Rama Krishna Rao
రాజేంద్రగారూ! ధన్యవాదాలండి.

Murali Krishna Pallam గురువర్యులకు అభినందన వందనములు.చాల సంతోషం గా ఉంది సార్.
Chinta Rama Krishna Rao
మురళీ! ఆశీస్సులయ్యా. చాలా సంతోషం.

Narayana Swamy శుభాభినందనలు.
Chinta Rama Krishna Rao
ధన్యవాదాలండి నారాయణ స్వామి గారూ!

Sreedhara Rao Machavolu గురువర్యులకు అభినందనపూర్వక వందనములు
Chinta Rama Krishna Rao
చాల సంతోషమండి. ధన్యవాదాలు.

Varaprasad Nagendra Kandula గురుదేవులకు వినమ్రవందనములు.
చాలా సంతోషంగా ఉంది . మీ సాహిత్య సేవకు ఇది చిరుకానుక, మరన్ని సత్కారములను పోందాలని ఆకాంక్షిస్తూ.. మీ వరప్రసాద్.
Chinta Rama Krishna Rao
మీ వంటి సహృదయులు చూపే ఆదరణే ఈనా సత్కృతి. ధన్యవాదాలండి.

Jyothi Valaboju అభినందనలు
Chinta Rama Krishna Rao
సంతోషమమ్మా. ధన్యవాదాలమ్మా.
Like · Reply · 1 · 10 hrs
Manage
Chinta Rama Krishna Rao

Bhanumathi Mantha
abhinaMdanalu.
Chinta Rama Krishna Rao
ధన్యవాదములమ్మా.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Ashok Vardhan
అభినందనలండి.
Chinta Rama Krishna Rao
ధన్యవాదములండి అశోక్ వర్ధన్ గారూ!

Lsrk Sastry అవిశ్రాంతంగా మీరు తెలుగు సాహుత్యోన్నతికి కృషి చేస్తుండగా తెలుగు తల్లికి లేదు చింత....రామకృష్ణ కవివరేణ్యా. హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు.
Chinta Rama Krishna Rao
ధన్యవాదాలండి.
Chinta Rama Krishna Rao మీ అందరి ప్రేమ మధ్య జీవించే నన్నుఁ గూర్చి వెలువడిన దినపత్రికలోని అంశను చూచి, చదివి, మీ ఆనందమును ఇష్టమును తెలుపుటద్వారా వ్యక్తము చేసిన మనీయులారా! మీ అందరికీ పేరు పేరునా నా ధన్యవాదములు తెలియఁజేసుకొనుచున్నాను.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Umadevi Balluri
అభినందనాలండీ.
Chinta Rama Krishna Rao
సంతోషమమ్మా. ధయవాదములమ్మా.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కారణాంతరాలవలన ఆలస్యమైంది. చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎన్నో మరెన్నో ఎన్నెన్నో సత్కారములను పొందుతూనే ఉండాలని ఆశీర్వదించి అక్క .

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

Sreedhara Rao Machavolu గురువర్యులు శ్రీ చింతా రామకృష్ణా రావు గారికి అభినందనపూర్వక వందనములు.
Chinta Rama Krishna Rao ధన్యవాదాలండి.

Bss Prasad గురువర్యులకభివందనములు.
Chinta Rama Krishna Rao ప్రసాద్ గారూ! ధన్యవాదాలండి.

Bavaji Yerramilli _/||\_

Chinta Rama Krishna Rao నమస్తే

Dhanikonda Ravi Prasad శ్రీ Chinta Rama Krishna Rao గారికి హృదయపూర్వకాభినందనలు. పద్యవిద్యకు ఈ కవిపండితవర్యులు చేస్తున్న సేవ నిరుపమానం .
Chinta Rama Krishna Rao మీ అభిమానమునకు ధన్యవాదములండి.

Itthagoni Venkateshwarlu అమేయ చింతనంబుతోడ నయ్యచింత వారలో
యుమాధవుంగృపాబ్ధితో ననూహ్య సాహితీ కృషీ
చమూధవుండ వైతి వయ్య చంద్రు కొక్క నూలు పూ
గు మీగురించి చెప్ప నైతగోని కూర్మి వందనం
బుమాల వేయు స్వీకరించి పూలు సల్లవేడెదన్

Chinta Rama Krishna Rao మీ అభిమానమునకు నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు.
మహత్కవిత్వ తత్వదాయి మా మనోజ్ఞ శారదా
సుహాసనాంచితప్రభల్, విశుద్ధ సత్ కవిత్వమున్
వహింపఁ జేసె మిత్రమా! ప్రభావమంత యామెదే.
సుహృజ్జనుల్ శుభాశిసుల్ వసుంధరన్ వహించె నన్.

అజ్ఞాత చెప్పారు...

సమాచారం చూసి చాలా సంతోషిం చాను.
ఇది ఆంధ్ర భారతి కే గౌరవం.
అభి నందనలు.
భవదీయుడు
DVGAసోమయాజులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.