గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2017, శనివారం

నూతన ఛందములు. .. .. .. శ్రీ వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి.

జైశ్రీరామ్.
వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి.

1.అనుష్టుప్ఛందము
ర.జ.గల.గణములు వృ.సం.171.సమాశ్రీ వృత్తము.
మాయ లోన పుట్టినావు
మాయ లోన పెద్దవైతి
మాయ జీవనంబు నంది!
మాయ నేల? మానవుండ!
మాయనేల=చనిపోవుటెందులకు?

2.రసాంబరీవృత్తము.బృహతీఛందము
ర.న.భ.గణములు.వృ.సం.443.
జ్ఞనమిచ్చు గురునిందిల
కానలేవు?కనులండియు!
దానబుద్డి కెడమై నచొ?
 కాన!యౌగ! జగమంతయు!
కాన=అడవి.

3.భాసిజవృత్తము బృహతీ ఛందము
భ.స.జ.గణములు.వృ.సం.351.

మంచిచెడులయోచనంబు
నెంచు!చతుర !జన్మ మంది!
కుంచితమగు!బుద్ధులేల?
పంచు సమసామ్య!మీవు!

4.సాత్వికవృత్తము.బృహతీ ఛందము.
స.న.భ.గణములు.వృ.సం.444.

అహ మెంచ కిహమందున!
దహియించకు!సుఖాలను!
వహియించుమ!సు జీవన!
రహిమించు!సుగుణంబుల!

5.సజసావృత్తము.బృహతీ ఛందము.
స.జ.స.గణములు.వృ.సం.235.

దిగువోని కీర్తి గనుమా?
పగమాని!సాటి జనులుం
దగనొప్పు!స్వేచ్ఛ !మనగన్
రగిలింప!మాను!మతమున్

6.సజసావృత్తము.బృహతీ ఛందము.
స.జ.స.గణములు.వృ.సం.235.

పగబూన!బీదరికమున్!
తగు తిండిలేక!బ్రతుకన్
సుగమాలు దూర మవగా!
నగరాలు ప్రాకె!జనముల్!

7.విశ్వ జ్యోత్సవృత్తము.బృహతీఛందము.
స.స.భ.గణములు. వృ.సం.412.

శివ ద్రోహికి!హృద్రోగము!
భవ బద్ధుకు!బంధంబును!
రవి !నిందకు!ధృగ్లోపము!
నివురౌ!తుది! దల్పన్వలె!
1.శివుడుజీవుల హృదయమున నుండును!కావున శివద్రోహికి
గుండెజబ్బువచ్చును.
2.భవబద్ధునకు=పాపాత్మునకు,బంధనము చేకురును.
3.రవిని నిందించు వానికి చూపుమందగించును.
4.ఈకళేబరము తుదికిబూది యౌనని తలంచ వలెను


8.విశ్వ జ్యోత్స్నవృత్తము.బృహతీ ఛందము.
స.స.భ.గణములు.వృ.సం.412.

స్థితి కర్తను నిందించిన!
పతితంబగు!తిండెంచగ!
వెత!భూసురలందం !జన!
గతి!తప్పవె!లోకంబులు!
వెతభూసురలందన్=బ్రాహ్మణుడుబాధలనందిన,లోకముగతి తప్పును.


9.స్తుతివృత్తము.అనుష్టుప్ఛందము.
స.భ.భ.గగ.గణములు.వృ.సం.52.

సమ న్యాయం!సమ ధర్మం!
సమ భోగం! సమ భాగ్యం!
సమ సామ్యం!కమనీయం!
సమ తేగా!మమతెంచున్?
స్వస్తి.
వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి.
జైహింద్.

Print this post

2 comments:

Unknown చెప్పారు...

గురుదేవులకు వినమ్రవందనములు
శ్రీ వల్లభ వారికి పాదాభివందనములు..
మాయనేల ఎంత వేదాంతసారమిది..అద్భుతమైన పద్యములు..
మాకు అందించిన మీకు ధన్యవాదాలు..

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవిశ్రేష్టులు శ్రీ వల్లభవఝుల వారికి శిరసాభి వందనములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.