జైశ్రీరామ్.
ఆర్యులారా!
శ్రీ కందుల వరప్రసాద్ గారు విరచించిన శంఖ బంధ కందమందమునకానందించండి.
నారద సేవిత హరిమరి
కోరితి నగధధరణిని కూరిమి కొరకై.
చేరెద నీదరి ధీరా
పారా! ముర హర వర ధరన్నగ శయనా!
జైహింద్.
Labels:
చిత్ర బంధ గర్భ కవితాదులు.
3 comments:
గురుదేవులకు వినమ్రవందనములు
చిత్ర, గర్భ పద్యములు వ్రాయునపుడు మిమ్ము మదిని నిల్పి వ్రాయు చుంటిని. ఈ చిత్ర, గర్భ పద్యములు మీ పాదములకు సమర్పించు చుంటిని.
ధరనేకలవ్యశిష్యులు
వరకందుల వరప్రసాదు, వరలించించె ననున్.
పరమేశ్వరి! కృపఁ బ్రోవుమ
కరుణాకర చిత్రకృతిఁ బ్రకాశిత శిష్యున్.
నమస్కారములు
అదృష్ట వంతులు వరప్రసాద్ గారు . గురువుల దయ
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.