గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, మార్చి 2017, గురువారం

నూతన ఛందములలో గర్భ కవిత 4. . . . రచన . . . శ్రీ వల్లభ,

 జైశ్రీరామ్.
జైహింద్.
Print this post

4 comments:

అజ్ఞాత చెప్పారు...

Suprabha Pavuluri
నీవె తల్లి నీవె తండ్రివే -నీరజాత పత్ర లోచనా
నీవె నాకు రక్షయౌదువే -నీరజాప్త కోటి భాసురా
నీవు గాక వేరు లేరుగా - నీరజాతగర్భ సుందరీ
నీవె నాకు సర్వమందునే- నీరజాసనీ! తరించనీ!

అజ్ఞాత చెప్పారు...

J K Mohana Rao
ఇక్కడ చెప్పబడిన మత్తరజనీ వృత్తము భావినీ, తరంగవతీ, కామినీ అనే పేరులతో వాడుకలో నున్నది. రెండు తరంగవతులను చేర్చగా లభించినది ఈ రజనీకర వృత్తము. ఇట్టి గర్భకవిత్వములు సులభమైనవి.

అజ్ఞాత చెప్పారు...

Suprabha Pavuluri‎

మత్తరజనీ ద్వయ గర్భ రజనీకర ప్రియ వృత్తము.
-----------------------------------------------------------------
రజనీకర ప్రియ వృత్తము
-----------------------------------
ర,జ,ర,ర,జ,ర గణములు - యతి -10
నీవె తల్లి నీవె తండ్రివే -నీరజాత పత్ర లోచనా
నీవె నాకు రక్షయౌదువే -నీరజాప్త కోటి భాసురా
నీవు గాక వేరు లేరుగా - నీరజాతగర్భ సుందరీ
నీవె నాకు సర్వమందునే- నీరజాసనీ! తరించనీ!
(గర్భిత) మత్తరజనీ వృత్తములు
--------------------------------------------
ర,జ,ర గణములు
యతి లేదు.
నీవె తల్లి నీవె తండ్రివే
నీవె నాకు రక్షయౌదువే
నీవు గాక వేరు లేరుగా
నీవె నాకు సర్వమందునే
నీరజాత పత్ర లోచనా
నీరజాప్త కోటి భాసురా
నీరజాతగర్భ సుందరీ
నీరజాసనీ! తరించనీ!
4;15 PM
02-03-2017
చింతా రామకృష్ణారావు గారు పంచిన పోస్ట్ లో వల్లభ వఝల వారి అష్టదళపద్మములోని మత్తరజనీ ద్వయగర్భ రజనీకర ప్రియ వృత్తము
ఆధారముగా వ్రాసినది. చాల సులువైనది. దీనికి భావినీ,కామినీ, తరంగవతీ అనే నామములు కూడ ఉన్నాయని జెజ్జాలవారు తమ వ్యాఖ్యలో వ్రాశారు.పద్మము కర్ణిక స్థానములో రజనీకర ప్రియ వృత్తములో 1,10 స్థానములలోనున్న అక్షరముండి (నీ) ఒక్కొక్కరేకులో ఒక్కొక్క మత్తరజనీ పాదముంటుంది. టెక్నాలజీ తో పెద్ద పరిచయము లేక పద్యములో నుంచి చూపలేకపోతున్నాను. అది ఎలాఉంటుందో తెలిసికొనదలచినవారికి చింతా వారి గోడపైన, ఆంధ్రామృతము బ్లాగ్ వద్ద అష్టదళపద్మములో చూపబడినవి వల్లభ వఝల వారి పద్యములున్నాయి.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి రచనాంబుధిలో " రజనీకర ప్రియ అష్టదళ పద్మ బంధము మనో రంజకముగా సులభ శైలిలో నున్నవి. కవి శ్రేష్టులకు హృదయ పూర్వక ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.