గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

3, మార్చి 2017, శుక్రవారం

కవయిత్రి పావులూరి సుప్రభ. ... శ్రీ వల్లభవఝలకవి మార్గములో రచించినస్వర్భాను,భూమిజ, త్రిభువన గర్భ భూభద్రిక వృత్తము

జైశ్రీరామ్.
కవయిత్రి పావులూరి సుప్రభ
స్వర్భాను,భూమిజ, త్రిభువన గర్భ భూభద్రిక వృత్తము 
కారణరహితయుఁ గలకంఠియుఁ గామదయును, భక్తిగమ్య, కారణమునున్‌
సారసనయనయు సరసాంగియు స్వామినియును, సత్యరూప, చాటఁగఁ దనన్‌.
దీరుగఁ గొలువఁగఁ దియతీయఁగఁ దీవనలిడఁ బ్రేమమీఱ, దేవి దయతోఁ
బారును బలుకును బలుభంగులఁ బద్యములను నల్లుకోఁగ బంధురముగన్‌.
స్వర్భాను 
కారణరహితయుఁ గలకంఠియు
సారసనయనయు సరసాంగియుఁ
దీరుగఁ గొలువఁగఁ దియతీయఁగఁ
బారును బలుకును బలుభంగుల
భూమిజ 
కారణరహితయుఁ గలకంఠియుఁ గామదయును
సారసనయనయు సరసాంగియు స్వామినియును
దీరుగఁ గొలువఁగఁ దియతీయఁగఁ దీవనలిడఁ
బారును బలుకును బలుభంగులఁ బద్యములను
త్రిభువన 
కారణరహితయుఁ గలకంఠియుఁ గామదయును భక్తిగమ్య
సారసనయనయు సరసాంగియు స్వామినియును సత్యరూప .
దీరుగఁ గొలువఁగఁ దియతీయఁగఁ దీవనలిడఁ బ్రేమమీఱఁ
బారును బలుకును బలుభంగులఁ బద్యములను నల్లుకోఁగ
సుప్రభ
12:45 PM
01-03-2017
వృత్తము -- ఛందము -- గణములు -- యతి/యతులు
భూభద్రిక --ఉత్కృతి --భ,న,న,భ,భ,స,జ,భ,లగ -- 13,22
స్వర్భాను -- జగతీ -- భ,న,న,భ -------------- 8
భూమిజ -- అత్యష్టీ -- భ,న,న,భ,భ,లల -------- 10
త్రిభువన -- ప్రకృతి -- భ,న,న,భ,భ,స,జ ------ 13
చింతా వారి ఆంధ్రామృతము బ్లాగ్ వద్ద ప్రచురింపబడినది, వల్లభ వఝల వారిచే రచింపబడిన "స్వర్భాను,భూమిజ,త్రిభువన గర్భ భూభద్రిక వృత్తము" ఆధారముగా పలికించేవారి దయతో కూర్చినది. చింతావారికి, వల్లభ వఝలవారికి హార్దిక ధన్యవాదములు. కృపతో వ్రాయించినవారికి సాదర ప్రణామములు.
                                                                                             జైహింద్.
-)


Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కవయిత్రి పావులూరి సుప్రభ గారు " శ్రీ వల్లభవఝులవారి స్పూర్తితో రచియించిన పద్యము లన్నియు హృద్యమముగా నున్నవి.శ్రీ చింతా సోదరుల బ్లాగు సువర్ణ గని

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.