వృత్తము --ఛందస్సు-- గణములు -- యతి/యతులు
హితకరి -- ఆకృతి -- భ,మ,న,జ,జ,ర,స,గ -- 1,9,18
శ్రీకర - అనుష్టుప్ - భ,మ,లల --యతిలేదు
ఆర్జనా -- అతిజగతీ - భ,మ,న,జ,ల ------- 1,9
మాదకశ్రీ - అత్యష్టీ -- భ,మ,న,జ,జ,గల ----- 1,9
గతిమా -- బృహతీ -- స,స,జ -- యతి లేదు
హితకరినాదని భావమ్మే విడి! నరులందరు నొక్క రంచు! నచ్చిన కొద్దీ మేదిని విస్వాసమ్ముగ ! మెరిపించక సేవ జేయు ! మిద్యను వీడిన్ వేదన లేకుండుండుట! విరఁజిమ్మును సాధనమ్ము ! వీర జవానై సాధన వల్లే కల్గును ! చరితన్ విను నేటి బాల ! సారపు పల్కుల్! మాదకశ్రీ నాదని భావమ్మే విడి! నరులందరు నొక్క రంచు! మేదిని విస్వాసమ్ముగ ! మెరిపించక సేవ జేయు ! వేదన లేకుండుండుట! విరఁజిమ్మును సాధనమ్ము ! సాధన వల్లే కల్గును ! చరితన్ విను నేటి బాల ! ఆర్జనా నాదని భావమ్మే విడి! నరులందరు మేదిని విస్వాసమ్ముగ ! మెరిపించక వేదన లేకుండుండుట! విరఁజిమ్మును. సాధన వల్లే కల్గును ! చరితన్ విను. శ్రీకర నాదని భావమ్మే విడి మేదిని విస్వాసమ్ముగ వేదన లేకుండుండుట సాధన వల్లే కల్గును! గతిమా నరులందరు నొక్క రంచు మెరిపించక సేవ జేయు విరఁజిమ్మును సాధనమ్ము. చరితన్ విను నేటి బాల ! 01-3 - 2017.
జైహింద్.
|
శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
2 రోజుల క్రితం
1 comments:
నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి మార్గములో వెలయించిన గర్భ కవి శ్రీ పొలిమేర మల్లేశ్వర రావుగారి పద్యము లన్నియు ఛందో బద్ధముగా అలరించు చున్నవి. అభినందన మందారములు .శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.