లాక్షాగృహమందు లవుడు లంకిణి గూల్చెన్. అనే సమస్యకు శ్రీ మరుమామల
దత్తాత్రేయావధాని పూరణ.
-
జైశ్రీరామ్.
శ్రీ మరుమామల దత్తాత్రేయావధాని
సమస్య.
*లాక్షాగృహమందు| లవుడు| లంకిణి గూల్చెన్.*
*మా తమ్ముని పూరణ.*
కం. రక్షణనిడె భీముడెచట?
రక్షాంతక రామ త...
3 రోజుల క్రితం
5 comments:
J K Mohana Rao
బావుంది. పాదమునకు 12 లఘువులు ఉండేది కూడ ఒక వృత్తమే. దాని పేరు తరళనయనా.
పావులూరి సుప్రభ.
పరిశీలన, కంద, చతురానన గర్భ త్రివిక్రమ వృత్తము
పలికించ వచ్చితిని, వడివడి పలుకులఁ గురిసెద వ్రాయఁగఁ గలవా
అలరించు ఛందమునె, యడుగకె యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
కలమద్ది తీయుమిక, గడుసుగ వలదని పలుకకు, కష్టము గలుగున్
వెలలేని కాన్కఁగొన, వెడలెడి నుడువులఁ గననగుఁ బెక్కులు గతులున్.
గర్భితమైనవి
చతురానన
వడివడి పలుకులఁ గురిసెద వ్రాయఁగఁ గలవా
యడుగక యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
గడుసుగ వలదని పలుకకు, కష్టము గలుగున్
వెడలెడి నుడువుల గననగు పెక్కులు గతులున్
కందము
వడివడి పలుకులఁ గురిసెద
నడుగకె యొసఁగెడి బహుమతి, యక్కజమిడుదే
గడుసుగ వలదని పలుకకు
వెడలెడి నుడువులఁ గననగుఁ బెక్కులు గతులున్
పరిశీలన
పలికించ వచ్చితిని
అలరించు ఛందమునె
కలమద్ది తీయుమిక
వెలలేని కాన్కఁగొన
చింతా వారికి, వల్లభ వఝల వారికి ధన్యవాదములు. పలికి / వ్రాయించిన వారికి వందనశతములు. -- సుప్రభ
03-11-2017.
సూక్ష్మగ్రాహివి సుప్రభా! శుభము నీ శుంభత్ కవిత్వాంబకున్.
లక్ష్మే వల్లభుడెల్ల వేళలను నీ లక్ష్యంబు లీడేర్చు. నీ
సూక్ష్మజ్ఞానము లోక మంగళమగున్ శోభిల్లుమా పుత్రికా!
ఈ క్ష్మా నిన్గని పొంగుతన్.సుకృతీన్ హేమాద్రివై వెల్గుమా.
Suprabha Pavuluri
చింతా వారికి నమస్సులు. మీ స్పందనకు, అందించిన ఆశీర్వాదపూర్వక శుభకామనలకు నేవిధంగా స్పందించాలో కూడ తెలియని పరిస్థితి లో బడిపోయాను. :-). ధన్యవాదసహస్రములు అని చెప్పినా చాలదని పించినది. మీ స్పందనకు సరితూగగల రీతిలో పద్యములో వ్రాయగలిగిన భాషాజ్ఞానము, పాండిత్యము, ధీశక్తి కూడ లేదు. తలపులను తెలిసిన వారు వెంటనే కలమును నడిపించి నాకు తెలిసిన భాషలో పలికించినవి క్రింది పద్యములు. _/||\_
తలి చూపించెడి మార్గమందుఁ జనుటే ధైర్యమ్ముగా నమ్మికన్
దలి నేర్పించిన రీతి నేర్చుకొనుటే తర్కించకెవ్వారితోఁ
దలియందించెడు పల్కులల్లుకొనుటే తట్టించు ఛందమ్ములోఁ
దలి వ్రాయించక వ్రాయజాలనెదియున్ దథ్యంబుగా, నమ్ముడీ
సులువైనట్టిది దారిఁజూపి తలియే చుట్టించుఁ నీరీతిగాఁ
గలుగంజేయును స్ఫూర్తి వేగ మదిలోఁ గైమోడ్చి నేఁ గోరకే
పలుఛందమ్ముల వ్రాయనేర్పి కృపతోఁ బల్కించు మీబోంట్లతోఁ
దొలిజన్మంబుల నేమి చేసితనియో దొర్లించుటీ పద్యముల్
పలికిన తీపి పల్కులకు వందనమిచ్చెద సాదరంబుగా
పలువిధమైన చిత్రముల బ్లాగునఁ జూపుచు మీదు కైతలన్
బలువురికిట్లు స్ఫూర్తినిడు పండితవర్యులు రామకృష్ణ మీ
రలు! తమ దీవనల్ మదిని రంజిలఁజేసిన వెంతగానొ, నా
తలపుల నందు నిల్పుకొని, ధన్యముగా జని, చేతుయత్నముల్
_/||\_
నమస్కారములు
కొన్నిఏళ్ళుగ చదువుతున్నా నామట్టి బుఱ్ఱకు ఒక్క అక్షరం కుడా రాయలెకపోతున్న నా అశక్తతకు సిగ్గుపడుతున్నాను.సుప్రభగారు విజ్ఞులు + అదృష్ట వంతులు .శ్రీ చింతా సోదరులు ధన్యులు
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.