శ్రీ లలితోపాఖ్యానము.
-
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
"హయగ్రీవా! కలియుగంలో భక్తులకు సర్వసుఖాలూ, మోక్షం ఇవ్వటానికి భండాసురుని
వధించటానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అ...
2 రోజుల క్రితం
5 comments:
J K Mohana Rao బావుంది. మహిమంబులు ... వృత్తములో ప్రాస తప్పినది. వృత్తము బాగున్నది. షణ్మాత్రల లయ చక్కగా ఉన్నది.
నమస్కారములు
పూజ్య గురువులు శ్రీ వల్లభవఝులవారి నూతన ఛందములో అన్ని రచనలు సులభ శైలిలో అద్భుతముగా నున్నవి .ధన్య వాదములు . శ్రీ చింతా సోదరులకు అభినందనలు
Suprabha Pavuluri to ఛందస్సు (Chandassu)
in face book
రక్షణీ, గతిమా, మహిత గర్భ నటకళా వృత్తము.
---------------------------------------------------------------
నటకళా వృ.
అందించెడి పద్యంబది హరుసంబునుఁ గూర్చకున్న నాపద రాదా
యందంబుగ రాకుండిన నరవిందము లీయవింక నర్మిలి తోడన్
వందించవు నన్నెప్పుడుఁ బరమేశిగఁ బల్కుచున్నఁ బ్రత్యహమిట్లే
క్రుందించితి నన్నట్లుగఁ, గొఱఁతేదియొ చేసినట్లు కోపమె నాపై
రక్షణీ
అందించెడి పద్యంబది
యందంబుగ రాకుండిన
వందించవు నన్నెప్పుడుఁ
గ్రుందించితి నన్నట్లుగ
గతిమా
హరుసంబునుఁ గూర్చకున్న
నరవిందము లీయవింక
పరమేశిగఁ బల్కుచున్నఁ
గొఱఁతేదియొ చేసినట్లు
మహిత
అందించెడి పద్యంబది హరుసంబును గూర్చకున్న
నం(అం)దంబుగ రాకుండిన నరవిందము లీయవింక
వందించవు నన్నెప్పుడు పరమేశిగ బల్కుచున్నఁ
గ్రుం(క్రుం)దించితి నన్నట్లుగఁ, గొఱఁతేదియొ చేసినట్లు
సుప్రభ
11:45 AM
02-25-2017
వృత్తము - ఛందస్సు - గణములు - యతి/యతులు
నటకళా -- ఆకృతి - త,య,న,జ,జ,ర,స,గ --1,9,18
రక్షణీ -- అనుష్టుప్ - త,య,లల
గతిమా -- బృహతీ - స,స, జ
మహిత -- అత్యష్టీ - త,య,న,జ,జ,గల -- 9
ఈ రోజు ఉదయము చింతా రామకృష్ణరావు గారు వల్లభ వఝల అప్పల నరసింహమూర్తి గారిచే వ్రాయబడినదని రక్షణీ, గతిమా, మహిత గర్భ నటకళా వృత్తముగా నొక పద్యమును ప్రచురించారు. నడక నచ్చి,తేలికగానే యున్నట్లుందని తోచి, యత్నించాలని యనిపించినది. మనసులోని యూహను తెలిసిన వారు వెంటనే సాయమందించి తమ తలఁపులుగా వ్రాయించినది. ఈ వృత్తమును పరిచయము చేసిన చింతా వారికీ, వల్లభ వఝల వారికీ ధన్యవాదములు. అడుగకున్నా మనసెరిగి, నామీఁదనే దోషారోపణ గావించి :-) యేదో విధముగా కూర్పించిన శక్తికి కూడ వందనములు.
అమ్మా! సుబ్రభ గారూ! నాకు చాలా ఆనందం కలిగించిందమ్మా మీ సద్యస్పందనతో అద్భుత బంధ కవితామృత కల్పన. చదువరులలో ఉత్సాహాన్ని పెంచారమ్మా. అభినందన పూర్వక ధన్యవాదములమ్మా.
Suprabha Pavuluri 6:37am Feb 26
నమస్సులు. నేను ప్రచురించిన పద్యము మీకానందము కలిగించినదంటే నా కలము జన్మ , ధన్యమైనట్లే. :-) మీలాటి వారి స్ఫూర్తితో ఈ ముఖపుస్తకము ద్వారా ఎన్నో క్రొత్త క్రొత్త విషయములను తెలిసికోగలుగుతున్నాము. సౌహార్ద్రభావముతో పలికిన మీ పలుకులకు, ఆంధ్రామృతము బ్లాగ్ ద్వారా పరిచయము చేస్తున్న ఆణిముత్యాలవంటి పద్యాలకు, తెలుపుతున్న విషయములకు కృతజ్ఞతా పూర్వక ధన్యవాదములు. _/||\_
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.